ఫెడరల్ ఫ్రంట్ మీటింగ్ : నేడు హైదరాబాద్ కు అఖిలేశ్ యాదవ్

Akhilesh-Yadav-KCRయూపీ మాజీ సీఎం సమాజ్‌ వాదిపార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్ బుధవారం (మే-2) హైదరాబాద్‌ రానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ కోసం సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. దేశంలో గుణాత్మకమార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన కేసీఆర్ దేశవ్యాప్తంగా వివిధ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ తో SP అధ్యక్షుడు అఖిలేశ్‌యా దవ్ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణ, ఎజెండా, భవిష్యత్ కార్యాచరణపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరుగనున్నట్టు తెలిసింది. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ లో కీలకమైన సమాజ్‌ వాదిపార్టీ భాగస్వామ్యంతో దేశంలో గుణాత్మకమార్పు లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని భావిస్తున్నారు.

గతనెల 25న లక్నోలో మంత్రి కేటీఆర్ అఖిలేశ్‌ యాదవ్‌ తో సమావేశమయ్యారు. ఫెడరల్ ఫ్రంట్‌ పై చర్చించేందుకు హైదరాబాద్ రావాల్సిందిగా కేసీఆర్ ఆహ్వానించారని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. అఖిలేశ్‌ కు తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన వెంటనే పర్యటనను ఖరారు చేసుకున్నారు. అఖిలేశ్ బుధవారం మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. టూరిజంప్లాజాలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రగతిభవన్‌ లో సీఎం కేసీఆర్‌ తో భేటీ అవుతారు. ముఖ్యమంత్రితో కలిసి భోజనం చేస్తారు. అనంతరం అఖిలేశ్ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ ఇంటికి వెళ్లి తేనీటి విందులో పాల్గొంటారు. ఫెడరల్‌ ఫ్రంట్ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ ఇప్పటికే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మాజీ ప్రధాని, JDS నేత దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, DMK అధినేత కరుణానిధి, స్టాలిన్‌ లను కలిశారు. వీరందరూ కేసీఆర్ నిర్ణయానికి సానుకూలంగా స్పందించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy