ఫేక్ న్యూస్ బస్టర్ : ఆ నంబర్ కాల్ ఎత్తితే ఫోన్ పేలదు

phone-noఅలర్ట్.. అలర్ట్.. ఈ నంబర్ నుంచి కాల్స్ వస్తే దయచేసి లిఫ్ట్ చేయకండి. లిఫ్ట్ చేశారో మీ ప్రాణాలు పోవడం గ్యారంటీ. అదో వైరస్ కాల్.. మీ ఫోన్ డేటాతో పాటు మీ ప్రాణాలను తీస్తుంది. ప్లీజ్ దీన్ని మరింత మందికి షేర్ చేయండి. ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుకున్న వార్త. ఇదొక మెసేజ్.. నంబర్ నుంచి కాల్ వస్తే చచ్చిపోవటం ఏంటీ.. అని ఆలోచించకుండానే ఆ మెసేజ్ ను ఫార్వర్డ్ చేసేస్తుంది పబ్లిక్. అంతేనా ఆ నంబర్ ఒక్కసారి చూసినా ఇది ఫేస్ బస్టర్ న్యూస్ అని తేలిపోతుంది. అలా చెక్ చేసేసుకోకుండా వాట్సాప్, ఫేస్ బుక్ లో పోస్టులు చేసేస్తున్నారు కొందరు. డెత్ కాల్ నంబర్ ఏంటో తెలుసా.. 777888999. ఇది తొమ్మిది అంకెలు. ఇండియాలో పది అంకెల నంబర్ ఉంటుంది.

ర్యాంసన్ వైరస్ ఎటాక్ తర్వాత ఆకతాయిలు పన్నిన కుట్ర ఇది. ఈ మధ్య కాలంలో వాట్సాప్, ఫేస్ బుక్, SMSలలో ఎక్కువగా వైరల్ అవుతున్న మెసేజ్ ఇది. ఫేక్ మెసేజ్ తో జనాల్ని బెంబేలెత్తించడానికి ఎవరో క్రియేట్ చేసిన ఈ మెసేజ్.. చాలా మందిని ఆందోళనకు గురి చేసింది. దీంతో దీనిపై దృష్టిపెట్టిన టెక్నాలజీ నిపుణులు ఇదంతా ఫేక్ న్యూస్ అని తేల్చారు. నంబర్ వెనక అసలు గుట్టును బయటపెట్టారు. భారత్ లో తొమ్మిది అంకెల మొబైల్ నంబర్ ఉండదని.. విదేశాల్లో మాత్రమే ఈ నంబర్ ఉంటుందని తెలిపారు. అది ఫేక్ నంబర్ గా తేల్చిచెప్పారు. ఒకవేళ మనకు కాల్ వచ్చినా ఇండియా కోడ్ లేకుండా ఉండదని స్పష్టం చేస్తున్నారు నిపుణులు. జనాన్ని బురిడీ కొట్టించటానికి ఎవరో కావాలనే ఇలా చేశారని కాస్త విజ్ఞతతో ఆలోచిస్తే.. ఇలాంటి వాటికి చెక్ పెట్టొచ్చంటున్నారు. ఫోన్లకు వస్తున్న మెసేజ్ లు ఇలా ఉన్నాయి. అయితే ఫోన్ కాల్ ఎత్తితే ఎలా చనిపోతారని.. అలాంటి అవకాశమే లేదని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి వదంతులను నమ్మొద్దని కోరుతున్నారు. ఇలాంటి మెసేజ్ లను ఫేస్ బుక్, వాట్సాప్ లలో షేర్లు, లైక్ చేయటం కూడా చేయొద్దని సూచిస్తున్నారు.
fake calls (2)

fake calls (3)

fake calls (1)

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy