ఫేక్ పాస్ పోర్ట్ లతో చక్కర్లు : న్యూయార్క్‌ కు నీరవ్ జంప్

nirav-modi JUMPపంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు స్కాంలో ప్రధాన సూత్రధారి అయిన నీరవ్‌ మోడీ కి అరెస్ట్‌ భయం పట్టుకుంది. నీరవ్‌ మోడీని అరెస్ట్‌ చేయాలని భారత్‌ పెట్టుకున్న ప్రతిపాదనకు హాంకాంగ్‌ అధికారులు ఒప్పుకోవడంతో, ఆయన అక్కడ నుంచి కూడా పారిపోయినట్టు తెలుస్తోంది. హాంకాంగ్‌ నుంచి నీరవ్‌ న్యూయార్క్‌ తరలి వెళ్లినట్టు రిపోర్టులు చెబుతున్నాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో రూ.13వేల 600 కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్‌, ఆ స్కాం బయటికి రాకముందే భారత్‌ విడిచి పారిపోయాడు. ఇండియా నుంచి పారిపోయి UAEలో తలదాచుకున్నాడు. అయితే అక్కడ కఠినతరమైన శిక్షలు ఉండటంతో, వెంటనే హాంకాంగ్‌ వెళ్లినట్టు తెలిసింది. ఫిబ్రవరి 2 నుంచి నీరవ్‌ హాంకాంగ్‌ లో ఉన్నట్టు భారత అధికారులు గుర్తించారు. నీరవ్‌ ను అరెస్ట్‌ చేయాలంటూ హాంకాంగ్‌ అధికారులను కోరుతూ భారత్‌ ఓ అభ్యర్థనను సైతం పంపింది. అలాగే PNB కూడా హాంకాంగ్‌ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హాంకాంగ్‌ లో ఉండటం కూడా ప్రమాదకమేనని భావించిన నీరవ్‌, వెంటేనే న్యూయార్క్‌ వెళ్లినట్టు చెబుతుంది రిపోర్టు.

నీరవ్ ఒరిజినల్‌ పాస్‌ పోర్ట్‌ క్యాన్సిల్ చేసినప్పటికీ, అతని వద్ద మరో పాస్‌ పోర్టు ఉందని, దాంతోనే ఒక దేశం నుంచి మరో దేశానికి పారిపోవడానికి సహకరిస్తున్నట్టు తెలిపాయి. నీరవ్ బ్యాంకులను ముంచడమే కాకుండా.. నకిలీ పాస్‌ పోర్ట్‌ కలిగి ఉండి చట్టాలను, నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు తెలిసింది. నిబంధనల ప్రకారం భారత పౌరులు ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉండటానికి అనుమతి లేదు. బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి పత్తా లేకుండా పోయిన డిఫాల్ట్రర్లను వెతికి పట్టుకునేందుకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు డిటెక్టివ్‌ ల సాయం తీసుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy