ఫేస్ బుక్ ఇండియా ఎండీ రాజీనామా

UMANG-BEDI-FBఫేస్‌బుక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఉమంగ్ బేడీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని మంగళవారం ఫేస్ బుక్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన స్థానంలో సౌత్ ఏషియా కన్జూమర్ అండ్ మీడియా డైరెక్టర్ సందీప్ భూషణ్‌ను తాత్కాలిక ఎండీగా నియమించినట్లు చెప్పింది. ఈ ఏడాది చివర్లో ఉమంగ్ బేడీ తన పదవి నుంచి తప్పుకోనున్నారు. తన హయాంలో ఆయన బలమైన టీమ్‌ను, వ్యాపారాన్ని విస్తరించగలిగారంటూ.. ఆల్ ద బెస్ట్ తెలిపింది ఫేస్ బుక్. 2016 మధ్యలో ఉమంగ్ ఫేస్ బుక్ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన అడోబ్ సౌత్ ఏషియా ఎండీగా పనిచేశారు. ఫేస్‌బుక్‌కు గుడ్ బై చెప్పిన తర్వాత సొంతంగా ఓ సంస్థ ప్రారంభించాలని ఉమంగ్ బేడీ భావిస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy