ఫేస్ బుక్ ఎకౌంట్లలో ఇండియన్స్ దే టాప్..?

imagesఫేస్ బుక్ లో ఇండియన్స్ టాప్ ప్లేస్ లోకి రానున్నారు. ఈ ఏడాదితో ఇండియన్స్ కొత్త ఫేస్ బుక్ ఎకౌంట్లతో టాప్ లోకి చేరునున్నారు. ఫేస్ బుక్ విషయంలో మన వాళ్లు చాలా ఫాస్ట్ గా గ్రోత్ అవుతున్నారనే బయటపెట్టింది ‘ఈ మార్కెటర్’ సర్వే. వీళ్ల సర్వే ప్రకారం ఇండియాలో ఈ ఏడాది చివరికల్లా 10 కోట్లకు చేరుతారనే సర్వే తేలింది.  ఇక 2013లో 7 కోట్ల ఉన్న ఫేస్ బుక్ యూజర్లు…కొత్తగా ఈ ఏడాది మరో మూడు మంది చేరనున్నారు.

ఈ ఫేస్ బుక్ ఎకౌంట్లు 2015 కల్లా 13 కోట్లు…2018 కల్లా 21 కోట్లకు చేరుతోందని సర్వేలో తేలింది. ఆసియా-పసిఫిక్ రిజీయన్ లో ఎక్కువ మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారని విశ్లేషించారు. ఈ ఏడాది ఫస్ట్ క్యార్టర్ లో ఇండియా, బ్రెజిల్ దేశాల నుంచి ఎక్కువ యూజర్లు వచ్చారని ‘ఈ మార్కెటర్’ సర్వేలో తేల్చారు. కేవలం ఈ ఏడాదిలో 40 శాతం గ్రోత్ ఉంటుందని, అమెరికా కంటే మన దేశంలోనే ఎక్కువ యూజర్లు వస్తారని ఫ్రూ అయ్యింది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy