ఫేస్ బుక్ కొత్త ఆలోచన: మ‌దిలో మాటే ప‌దాలుగా..

fbమానవుని మేధాశక్తికి ఆకాశంమే హద్దుగా మారుతోంది. టైప్ చేసే రోజుల నుండి వాయిస్ టైపింగ్ వరకు టెక్నాలజీలో పెను మార్పులు వచ్చాయి. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఫేస్ బుక్ వాడుతున్నారు. తాజాగా ఫేస్ బుక్ కొత్త అప్ డేట్ తో ముందుకు రానుంది. మనస్సులో ఏమనుకున్నా టైప్ చేసేలా తయారు చేస్తున్నట్లు ఆ సంస్ధ CEO మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించారు. ప్రస్తుతం నిమిషానికి 8 పదాలను సెన్సార్ ద్వారా గ్రహించి టైప్ చేస్తుందనీ… కొత్త టెక్నాలజీతో నిమిషానికి 100 పదాలను టైప్  చేసేలా రూపొందిస్తున్నామన్నారు. ఉదాహరణకు మీటింగ్ లో ఉన్నా.. లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మెయిల్,మెసేజ్ చేయడం కష్టం. ఆసమయంలో రిప్లై ఇవ్వాల్సింది మనసులో అనుకుంటే చాలు  దానంతట అదే రిప్లే ఇస్తుందన్నారు. ఇదే కనుక జరిగితే టెక్నాలజీలో మార్పు సంగతి ఏమో కానీ ప్రశాంతంగా మనస్సులో కూడా ఎవ్వరినీ ఏమీ అనుకోలేని అయోమయ పరిస్ధితి ఏర్పడుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

One Response to ఫేస్ బుక్ కొత్త ఆలోచన: మ‌దిలో మాటే ప‌దాలుగా..

  1. Anonymous says:

    Sir can we know when it is gona come… When we are going to enjoy that new update..

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy