
వీరి దుస్థితిని గమనించిన బెల్లంపల్లి మైహార్ట్ బీట్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సుదర్శన్, కల్పన జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన సోషల్ వర్కర్ రేణికుంట రమేశ్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో రమేశ్ ఈ నెల 1న పుష్ప దీనస్థితిని FBలో పోస్ట్ చేసి ఫ్రెండ్స్ సహకారం కోరాడు. దీంతో రూ.1.06 లక్షలు జమయ్యాయి. వీటితో పుష్పకు ఇల్లు నిర్మించారు.