ఫేస్ బుక్ పై ట్రంప్ సంచలన నిర్ణయం

Facebook News Feedఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయానికి రెడీ అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా భావస్వేచ్ఛకు ప్రతీకగా నిలుస్తున్న ఫేస్ బుక్ పై ఫోకస్ చేశారు ట్రంప్. త్వరలోనే అమెరికా వ్యాప్తంగా ఫేస్ బుక్ ను బ్యాన్ చేసేందు సిద్ధమయ్యారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న బ్యాన్ పై ముందుకే వెళతానంటున్నారంట ట్రంప్.

ఫేస్ బుక్ లో ఫేక్ న్యూస్ పుంఖాను పుంఖాలుగా వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లు కూడా ఉన్నా… ఒక్క ఫేస్ బుక్ పైనే ట్రంప్ దృష్టి పడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.  వందల కోట్ల మంది ఫాలో అవుతున్న సోషల్ మీడియా దిగ్గజంపై ఈ విధంగా కత్తికట్టడాన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు నెటిజన్లు.

పాలకుల అభిప్రాయాలను ప్రజల నెత్తిపై రుద్దటం తగదంటున్నారు ఫేస్ బుక్ ఉద్యోగులు. నిషేధం మాటున ట్రంప్ కు సపరేట్ ఎజెండా ఉందని వాపోతున్నారు. ఫేస్ బుక్ పై నిజంగానే నిషేధం విధిస్తే…. అమెరికాలో మరో ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy