ఫేస్ బుక్ లో “డౌన్ వోట్” ఫీచర్

FACEBOOKమరో కొత్త  ఫీచర్‌ను లాంచ్‌ చేసేందుకు  సిద్ధమవుతోంది ఫేస్‌బుక్‌.  ఫేస్‌బుక్‌లో అసంబద్ధ కామెంట్ లు, బూతు కామెంట్లతో ఇబ్బందులు పడే  యూజర్ల సౌకర్యం కోసం ‘డౌన్‌ వోట్‌ ’ అనే ఫీచర్‌ను టెస్ట్‌  చేస్తోంది.  అయితే  చాలామంది ఫేస్‌బుక్‌ యూజర్లు  అనుకుంటున్నట్టుగా డిస్ లైక్ బటన్‌లా కాకుండా సరికొత్తగా దీన్ని పరీక్షిస్తోంది.

ఫేస్‌బుక్‌ యూజర్లను ఇబ్బంది పెట్టే  కామెంట్‌పై  సంబంధిత  యూజర్లు డౌన్‌వోట్‌ బటన్‌ క్లిక్‌ చేసినపుడు  ఆ కామెంట్ ప్రమాదకరమైనదా, తప్పుదోవ పట్టించేదా, లేదా టాపిక్‌తో సంబంధం లేనిదా  చెప్పమని అడుగుతుంది. తరువాత ఆ కామెంట్లు మిగతా యూజర్లకు కనిపించకుండా చేస్తుంది. యూజర్ల పోస్ట్‌లపై అవాంఛనీయమైన కామెంట్లకు మాత్రమే ఇది ఉద్దేశించిందని  ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ విషయాన్ని ధృవీకరించిన సంస్థ  ప్రస్తుతం అమెరికాలో  చాలా కొద్దిమందిపై ప్రయత్నిస్తున్నట్టు చెప్పింది. పబ్లిక్ పోస్టులపై వ్యాఖ్యలపై  ఫీడ్‌ బ్యాక్‌ కోసం ఈ ఫీచర్ ను పరీక్షిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. 2009 లో లైక్‌ ఆప్షన్‌ను తీసుకొచ్చినపుడు డిజ్‌లైక్‌ బటన్‌ కూడా చేర్చాలని యూజర్లు కోరటంతో 2016లో రియాక్షన్‌ ఎమోజీలను (ప్రేమ, నవ్వు, ఆశ్చర్యం, విచారం లాంటి) కంపెనీ వాటికి జోడించింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy