ఫేస్ బుక్ లో పోస్ట్ : కంగుతిన్న బాలనటి

meenakshiప్రస్తుతం సినిమా ప్రమోషన్ల కోసం అందరూ సోషల్‌ మీడియాపై ఆధారపడుతున్నారు. మలయాళ బాలనటి మీనాక్షి(12) కూడా తనను ప్రమోట్‌ చేసుకునేందుకు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. ఆ పోస్టు ఆమెకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. 1.1 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో 2255 అనే నంబర్‌ ప్లేటు గల కారును నడుపుతున్న మీనాక్షి ఒక చోట ఆగి.. మోహన్‌లాల్‌ ఫేమస్‌ డైలాగ్‌ ‘ నా ఫోన్‌ నంబర్‌ 2255’ అంటూ ఆయన్ని అనుకరించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. సుమారు లక్ష మంది ఈ వీడియోను వీక్షించారు.

వీరిలో కొందరు మీనాక్షిని మెచ్చుకోగా.. చాలా మంది మాత్రం నువ్వు చేసింది కరెక్ట్‌ కాదంటూ కామెంట్‌ చేశారు. ‘నువ్వు మైనర్‌వి. ఇలాంటి వీడియోలు పోస్ట్‌ చేయడం వల్ల చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ’ కొందరు సలహా ఇవ్వగా… ‘ఇలాంటి వీడియోలు ఇంకెప్పుడూ పోస్ట్‌ చేయకు.. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన నువ్వు ఇలా చేయడమేమిటి’  అంటూ మరొకరు కామెంట్‌ చేశారు. రోడ్లపైనైనా ప్రైవేట్‌ లాండ్‌లోనైనా లైసెన్స్‌ లేకుండా కారు నడపడం నేరమంటూ.. మైనర్‌ కారు నడుపుతున్న వీడియోను ఎలా పోస్ట్‌ చేస్తారు. అయినా మీరెలా చట్టం నుంచి తప్పించుకోగలిగారని’ మరొకరు కామెంట్‌ చేశారు.

దీంతో కంగుతిన్న మీనాక్షి వివరణ ఇచ్చారు. మ్యూజికల్‌ రొమాంటిక్‌ కామెడీ డ్రామాగా తెరకెక్కిన  ‘మోహన్‌లాల్‌’ సినిమా ఏప్రిల్‌ 14న విడుదల కానుంది. గతంలో మోహన్‌లాల్‌ హీరోగా తెరకెక్కిన ఒప్పం (తెలుగులో కనుపాప) సినిమాలో బాలనటిగా కనిపించిన మీనాక్షి ప్రస్తుతం మోహన్‌ లాల్‌ పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy