ఫైట‌ర్ జెట్ దొరికింది.. పైలెట్స్ మిస్సింగ్

sukhoiమే 23వ తేదీన అసోం తేజ్‌పూర్ నుంచి బ‌య‌లు దేరిన సుఖోయ్ Su-30 జెట్ విమానం క‌నిపించ‌కుండా పోయిన సంగ‌తి తెలిసిందే. చైనా స‌రిహ‌ద్దుల్లో ఈ ఫైట‌ర్ ప్లేన్‌కు సంబంధించిన భాగాల‌ను క‌నుగొన్నారు. ఇందులో ఉన్న ఇద్ద‌రి పైలట్ల ఆచూకీ మాత్రం తెలియ‌రాలేదు. ఉద‌యం 9:30 గంల‌కు టేకాఫ్ తీసుకున్న సుఖోయ్ అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ దౌలాసంగ్ వ‌ద్ద రేడార్ వ్య‌వ‌స్థ‌తో సంబంధాలు తెగిపోయాయి. చివ‌రిసారిగా ఉద‌యం 11:30 గంట‌ల‌కు పైల‌ట్ల‌తో సంభాషించ‌డం జ‌రిగింది. ఆ స‌మ‌యంలో తేజ్‌పూర్‌కు 60 కిలోమీట‌ర్ల దూరంటో సుఖాయ్ ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

1990లో ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌లోకి తొలిసారిగా సుఖోయ్ విమానాలు చేరాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 7 సుఖోయ్ విమానాలు కూలిపోయాయి. తాజా ప్రమాదానికి కార‌ణం సాంకేతిక లోప‌మేన‌ని అధికారులు తెలిపారు. ఈ ఏడాది మార్చిలో సుఖోయ్  Su-30 రాజ‌స్థాన్ ఎయిర్ బేస్ ద‌గ్గ‌ర కూలిపోయింది. అందులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు పైలెట్లు స్వ‌ల్ప‌గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. సుఖోయ్ విమాన ప్ర‌మాదంపై త‌మ వ‌ద్ద ఎలాంటి స‌మాచారం లేద‌ని చైనా బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy