ఫొటోలు తీస్తే భయపడతామా! : ఆరు నెలల్లో 14లక్షల హెల్మెట్ కేసులు

helmentనగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మృతులు, గాయపడుతున్న వారిలో టూ వీలర్స్ ఎక్కువ. ముఖ్యంగా తలకు దెబ్బతగిలి వెంటనే ప్రాణాలు కోల్పోతున్న వారి రోజురోజుకి పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని హెల్మెట్ మస్ట్ చేసింది రవాణా, ట్రాఫిక్ డిపార్ట్ మెంట్. జరిమానా విధిస్తుంది. అయినా హెల్మెట్ పెట్టుకోకుండా, కేసులకు కూడా భయపడని వారి సంఖ్య కూడా లక్షల్లో ఉంది. గత ఏడాది కంటే ఈ సారి హెల్మెట్ లేని కేసుల సంఖ్య అక్షరాల 5లక్షల పెరగటం విశేషం.

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో హెల్మెట్ కేసులు విపరీతంగా పెరిగాయి.  2016 జూన్ నుంచి 2016 నవంబర్ 13వ తేదీ వరకు 9లక్షల 86వేల 163 కేసులు నమోదయ్యాయి. 2017 జూన్ నుంచి నవంబర్ 13వ తేదీ వరకు 14లక్షల 15వేల 661 కేసులు నమోదయ్యాయి. ఏడాదితో పోల్చుకుంటే ఐదు లక్షల కేసులు పెరగటం ఆందోళన కలిగిస్తోంది ట్రాఫిక్ పోలీసులకు.

సిటీ శివార్లలో పోలీస్ తనిఖీలు చేస్తున్నా.. ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నా బైక్‌ రేసింగ్‌లూ తగ్గడం లేదు. రేసర్లతోపాటు.. పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిని ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేకంగా గుర్తిస్తున్నారు. జరిమానా విధించి పంపితే మళ్లీ మళ్లీ అలానే చేస్తారని గ్రహించి, ఇలాంటి వారి వాహనాలను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. రెండోసారి కౌన్సెలింగ్‌కు హాజరైనట్లు శిక్షణ కేంద్రం గుర్తించిన తర్వాత వాహనాలను తిరిగి ఇస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy