
గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి..?డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు అయినందుకు ఎలా ఫీలవుతున్నావని కేసీఆర్ అడగగా….డబుల్ బెడ్రూం ఇంట్లో తను ఉంటానని కలలో కూడా ఊహించలేకపోయానని నాగమణి తెలిపారు. గ్రామంలో కూడా అభివృద్ధి బాగా జరుగుతోందన్నారు. తుమ్మల నాగేశ్వరరావు తమ గ్రామాన్ని దత్తత తీసుకున్నందున పనులు మరింత వేగవంతంగా జరుగుతున్నాయని నాగమణి కేసీఆర్‌కు వివరించింది. ఒంటరి మహిళలు గ్రామంలో ఎంతమంది ఉన్నారని సీఎం ప్రశ్నించగా…. తమ ఊర్లో ఆరు మంది ఒంటరి మహిళలు ఉన్నారని సమాధానంగా చెప్పిన నాగమణి వారికి ఫించను అందిస్తే బతుకులు బాగుపడతాయని చెప్పింది. రాష్ట్రం మొత్తం కూడా ఇవ్వాలా అని కేసీఆర్ ప్రశ్నించగా ఒంటరి మహిళలను పెన్షన్‌తో ఆదుకుంటే బాగుంటుంది సార్ అని నాగమణి సమాధానం ఇచ్చింది. మద్దులపల్లిని మరో గంగదేవిపల్లిలాగా చేసుకోవాలని, అందుకు ప్రభుత్వ సహాయసహకారాలు అందిస్తామన్నారు కేసీఆర్. హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తనను కలవాల్సిందిగా కేసీఆరే చెప్పడంతో నాగమణి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
sir maku evadaniki avaru leyru
kanisam oka room kuda
i am also looking for de same opportunity sir..for 2bhk