ఫోర్బ్స్‌ లిస్టు: 83వ స్థానంలో కోహ్లీ

kohliవరల్డ్ లోనే అత్యధిక ఆదాయం పొందుతోన్న టాప్‌-100 అథ్లెట్ల జాబితాను ఫోర్బ్స్‌ ప్రకటించింది. ఈ లిస్టులో భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్ కోహ్లీ 24 మిలియన్ల డాలర్ల ఆదాయంతో ఇందులో 83వ స్థానం సంపాదించుకున్నాడు. భారత్‌ నుంచి ఈ జాబితాలో స్థానం దక్కించుకున్న ఏకైక ఆటగాడు కోహ్లీ మాత్రమే. 22 దేశాలకు చెందిన ఆటగాళ్లు టాప్‌-100లో నిలిచారు. అత్యధికంగా అమెరికా నుంచి 66 మంది ప్లేయర్లు ఈ లిస్టులో స్థానం దక్కించుకున్నారు.

గతేడాది జూన్‌ 1 నుంచి ఈ ఏడాది జూన్‌ 1 మధ్య ఆదాయాన్ని లెక్కలోకి తీసుకొని ఈ జాబితాను ప్ర‌క‌టించింది ఫోర్బ్స్ . అమెరికా బాక్సింగ్‌ దిగ్గజం మేవెదర్‌ 285 మిలియన్‌ డాలర్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు.  అర్జెంటీనా ఫుట్‌బాల్‌ ఆటగాడు మెస్సీ(111 మిలియన్‌ డాలర్లు), పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో(108 మిలియన్‌ డాలర్లు) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy