ఫోర్బ్స్ జాబితాలో ఆలియా, ఒలింపిక్ స్టార్స్‌

forbesఆసియా నుంచి ఫోర్బ్స్ 30 ఏళ్ల వ‌య‌సులోపు సూప‌ర్ అచీవర్స్ లిస్ట్‌లో స్థానం సంపాదించారు. 30 అండ‌ర్ 30 పేరుతో ఫోర్బ్స్ రెండోసారి 300 మంది పేర్ల‌తో ఈ జాబితాను విడుద‌ల చేసింది. ఇందులో 53 మంది ఇండియ‌న్స్ కు చోటు దక్కించుకున్నారు. చైనా 76 మందితో తొలి స్థానంలో ఉండ‌గా.. భార‌త్ రెండోస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో భార‌త్ త‌ర‌ఫున‌ దీపా క‌ర్మాక‌ర్ టాప్‌లో నిలిచింది. మెడ‌ల్ గెల‌వ‌క‌పోయినా భార‌త్ త‌ర‌ఫున ఒలింపిక్స్‌లో పార్టిసిపేట్ చేసిన తొలి మ‌హిళా జిమ్మాస్ట్‌గా చ‌రిత్ర సృష్టించిన దీపాకు ఈ అరుదైన గౌర‌వం ద‌క్కింది.
12 ఏళ్ల వ‌య‌సులో రెజ్లింగ్‌ను కెరీర్‌గా తీసుకొని ఎన్నో అడ్డంకుల‌ను ఎదుర్కొని సాక్షి మెడ‌ల్ గెలిచింద‌ని ఫోర్బ్స్ ప్ర‌శంస‌లు కురిపించింది.  సినీ నటి ఆలియా భ‌ట్‌కు కూడా ఈ లిస్ట్‌లో స్థానం ల‌భించింది .ఇప్ప‌టివ‌ర‌కు న‌టించింది త‌క్కువ సినిమాల్లోనే అయినా.. త‌న‌కంటూ ప్ర‌త్యేకంగా ఓ ఇమేజ్ సంపాదించుకుంది. వీళ్లు కాకుండా భార‌త్ నుంచి తొలి పారాలింపిక్ స్విమ్మ‌ర్ శ‌ర‌త్ గైక్వాడ్‌, మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న లైంగిక వేధింపుల‌కు వ్య‌తిరేకంగా పోరాడేందుకు షిసేస్ అనే సంస్థ‌ను స్థాపించిన త్రిషా శెట్టి కూడా జాబితాలో ఉన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy