జపాన్ ఫ్యాక్టరీల్లో కూరగాయలు తయారవుతున్నాయి

toshiba-indoor-farm-121కూరగాయలు ఎక్కడ పండిస్తారు ? పొలాల్లో అని జవాబిస్తారు కదా. పొలాల్లోనే కాదు, ఫ్యాక్టరీల్లో కూడా కూరగాయలు పండించొచ్చు. ఈ ఫ్యాక్టరీల్లో కూరగాయలు పండించడానికి మట్టే అక్కర్లేదు. సూర్యకాంతి కూడా అవసరంలేదు. నిజంగా నిజం. కావాలంటే చదవండి.

వానలొస్తేనే పంటలు పండేది. ఎరువులు వేస్తేనే దిగుబడి ఎక్కువొస్తుంది…..ఇవన్నీ పాత మాటలు. జపాన్ లో కొన్ని ఫ్యాక్టరీల్లో కూరగాయలు తయారుచేస్తున్నారు. ఎకరాలకు ఎకరాలు పొలాలు అక్కర్లేదు. బీరువాలో షెల్ఫుల మాదిరిగా అమర్చిన అరల్లోనే కూరగాయలు పండిస్తారు. దాదాపు కోళ్ళఫారమ్ లాంటిదే ఈ ఫ్యాక్టరీ.

japan factories - 1ఇక్కడ కనిపిస్తున్నది కేబేజీలాంటి లెటిస్. ముందు ఈ లెటిస్ విత్తనాలను బాక్టీరియా లేకుండా క్లీన్ చేస్తారు. పోషకాలతో తయారుచేసిన సొల్యూషన్ లో వీటిని నాటతారు. అంటే, అవి త్వరత్వరగా పెరిగేటట్టుగా ఈ పోషకాలు తోడ్పడతాయి. ఏపుగా పెరగడానికి అవసరమైన పోషకాలన్నీ ఉంటాయి కనుక, మట్టి అవసరమే లేదు. ఈ షెల్ఫ్ లోనే లెటిస్ పెరిగి కోతకొస్తుంది. ఇక్కడ తెల్లటి అచ్చుల్లో కనిపిస్తున్నదే సొల్యూషన్. మట్టికి బదులుగా ఈ సొల్యూషన్ వాడతారు. మామూలుగా అయితే, సూర్యరశ్మి లేకుండా మొక్క ఎదగదు. కానీ ఈ ఫ్యాక్టరీలో అసలు సూర్యరశ్మి అవసరంలేదు. లైట్లతోనే వీటికి ఆ లోటు తీరుస్తారు. ప్రతి షెల్ఫులో లైట్లు చూడండి. ఇవి అమ్మకానికి పెట్టిన లెటిస్ కాదు, ఫ్యాక్టరీలో తయారవుతున్నవి. వీటికి ఎలాంటి పీడలు సోకవు. బ్యాక్టీరియా లేకుండా, ఎలాంటి వైరస్ లు లేకుండా ఉంటాయి. అంటే ఆర్గానిక్ కూరగాయలకన్నా రెండాకులు ఎక్కువే. పేషంట్లు కూడా వీటిని తినొచ్చు. అంత సేఫన్నమాట.

మామూలుగా లెటిస్ రెండునెలల్లో కోతకి వస్తుంది. అదే ఫ్యాక్టరీలో పంట అయితే, నెలరోజులకే కోసి తినేయొచ్చు. ఇంతకుముందు సెమీ కండక్టర్లు తయారుచేసే ఫ్యాక్టరీలోనే ఇప్పుడు కూరగాయలు పండిస్తున్నారు. అంటే ఇది ఒక ప్రోడక్టులా తయారుచేస్తున్నారు తప్ప కూరగాయల్లా కాదు. ఇలా మాస్క్ లవీ వేసుకునే లోపలికి వెళ్ళాలి. ఇవి ఫ్యాక్టరీల్లోనేకాదు, ఎక్కడ పడితే అక్కడ పండించేటట్టుగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయ్.  ఉదాహరణకు హోటళ్ళలో కూడా పండించేయొచ్చు. అప్పటికప్పుడు వాటిని కోసి, వండి వడ్డించొచ్చు.

A worker harvests fresh produce from a tower at Sky Greens vertical farm in Singaporeతోషిబాలాంటి పెద్ద కంపెనీలు ఈ ఫ్యాక్టరీల్లో లెటిస్ ను టన్నులకొద్దీ పండిస్తున్నాయ్. జపాన్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది వీటికి.  ప్రస్తుతానికి విత్తులు నాటడం, బాగానే పెరుగుతుందా లేదా అని చూడడం మనుషులే చేస్తున్నారు. ముందుముందు అన్నీ రోబోలే చేస్తాయట.  ఈ ఫ్యాక్టరీలు మనకీ వస్తే, వ్యవసాయం నిజంగా పరిశ్రమే అవుతుంది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy