ఫ్యాన్స్ కి కృష్ణాష్టమి ట్వీట్ : మహేష్ 25వ సినిమా ప్రారంభం

20729401_1044167442352851_17795763483864028_nప్రిన్స్ మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించారు నమ్రత. కృష్ణాష్టమిని పురస్కరించుకుని మహేశ్‌బాబు 25వ చిత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవిశ్రీ ప్రసాద్‌, దిల్‌రాజు, మహేశ్‌ భార్య నమ్రత శిరోద్కర్‌, పిల్లలు గౌతమ్‌, సితార పాల్గొన్నారు.  వంశీ పైడిపల్లి తెరకెక్కించే ఈ చిత్రాన్ని అశ్విని దత్‌, దిల్‌రాజు సంయుక్తంగా నిర్మించనున్నారు. అశ్విని దత్‌ నిర్మాతగా వ్యవహరించిన ‘రాజకుమారుడు’ చిత్రంతో మహేశ్‌ హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఆనవాయితీగా ఈ చిత్ర ప్రారంభోత్సవానికి మహేష్ హాజరుకాలేదు.  ఈ విషయాన్ని నమ్రత ఫేస్ బుక్ లో తెలుపుతూ..ఇందుకు సంబంధించిన ఓ ఫోటోను పోస్ట్ చేసింది.  ప్రస్తుతం మహేశ్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ‘స్పైడర్‌’, కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్‌ అనే నేను’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy