మా ఫ్యామిలీ అంతా ఐ ఫోన్ ఫ్యాన్సే: కవిత

KAVITHA1‘మా ఫ్యామిలీ అంతా ఐ ఫోన్ ఫ్యాన్స్’ అని చెప్పారు ఎంపీ కవిత. గురువారం అర్ధరాత్రి 12 గంటలకు ఐఫోన్-6ను రిలీజ్ చేసిన ఆమె ఐ ఫోన్ వాల్డ్ కే ఇన్ స్పిరేషన్ అని చెప్పారు. హైదరాబాద్ లోని తాజ్ వివంతా హోటల్ లో ఆమె ఐ ఫోన్-6ను కొడుకు ఆర్యతో కలిసి రిలీజ్ చేశారు. తమ ఇంట్లో ప్రతి ఒక్కరికీ ఐ పాడ్, ఐ ఫోన్లు ఉన్నాయని కవిత చెప్పారు. యాపిల్ అంటేనే బ్రాండ్ అని..డిజైన్లు లైక్ చేసే వారు ఖచ్చితంగా యాపిల్-6 ఫోన్ కొంటారని కవిత చెప్పారు. హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా కూడా ఐఫోన్-6లు రిలీజ్ అయ్యాయి. ఐఫోన్-6 కోసం గత 20 రోజులుగా చాలా మంది అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy