ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ‘గోవిందుడు..’

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ డైరెక్షన్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘గోవిందుడు అందరి వాడేలే’. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా ఆడియోను రిలీజ్ చేశారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. కృష్ణ వంశీ మార్క్ సెంటిమెంట్ సీన్లు, రాం చరణ్ ఎనర్జిటిక్ పర్ ఫార్మెన్స్ తో రిలీజ్ అయిన కొత్త ట్రైలర్ ఫ్యాన్స్ ను అలరిస్తోంది. అక్టోబర్ 1 న రిలీజ్ కానున్న ఈ సినిమాలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, జయసుధ కీ రోల్స్ లో యాక్ట్ చేస్తున్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy