ఫ్రాన్స్ కు డబ్బు కష్టాలు

france economic emergencyస్వేచ్ఛకు కేరాఫ్ ఆ దేశం. ప్యాషన్ కు ట్రెండ్ సెట్టర్. రక్షణకు పెట్టని కోట. టూరిజానికి రోల్ మోడల్ అదే ఫ్రాన్స్. అలాంటి స్వేచ్ఛా స్వర్గం… కొత్త విధానాలను చూడబోతోంది. ఫ్రాన్స్ లో ఎకనమిక్ ఎమర్జెన్సీని ప్రకటించారు ఆ దేశాధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే. అసలు ఫ్రాన్స్ లో ఆర్థిక అత్యవసర పరిస్థితికి కారణమేంటి ?

ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ఆ దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. వ్యాపార వేత్తలను ఉద్దేశించి చేసిన వార్షిక ప్రసంగంలో హోలాండే… తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఆర్థిక, సామాజిక నమూనాను పునఃవ్యవస్థీకరించడంలో భాగంగా ఫ్రాన్స్ 5 లక్షల మందికి వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్టు హోలాండే వెల్లడించారు.

యూరోపియన్ యూనియన్ లో అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థ ఫ్రాన్స్ ది. కానీ అది ఒకప్పటి మాట. నిరుద్యోగం రేటు 10.6 శాతానికి పెరిగింది. వృద్ధి రేటు ఒక శాతానికి మించి నమోదు కావట్లేదు. అన్ ఎంప్లాయిమెంట్ రేట్ తో EUలో తీవ్రమైన ఇబ్బందుల్లో కూరుకుపోయింది ఫ్రాన్స్. EUలో అన్ ఎంప్లాయిమెంట్ రేటు 9.8 శాతం. దాన్ని ఫ్రాన్స్ క్రాస్ చేయడం ఎకనమిక్ ఎమర్జెన్సీకి ఓ కారణం. దీనికి తోడు వారానికి 35 గంటల వర్కింగ్ అవర్స్ కూడా నిరుద్యోగం పెరగడానికి కారణం. అంటే రోజుకు ఐదు గంటలే పని. కార్మిక చట్టాలు అమలు పక్కాగా చేయడంలో భాగంగా 35 గంటల పనికే భారీ మొత్తంలో జీతాలిచ్చేలా గతంలో కార్మిక చట్టాల్ని సవరించారు. దాంతో పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దాంతో ఉత్పాదకత భారీగా తగ్గిపోయింది. పెద్ద ఎత్తున జీతాలివ్వలేక… ప్రొడక్టివిటీని పెంచుకోలేక.. నష్టాలతో ఎన్నో కంపెనీలు మూతపడ్డాయి. దాంతో నిరుద్యోగం పెరిగింది. రీసెంట్ గా జరిగిన ఉగ్రవాద దాడులు కూడా నిరుద్యోగం నుంచి పుట్టుకొచ్చినవేనన్న అభిప్రాయాలున్నాయి. అన్నీ కలిపి ఫ్రాన్స్ ను ఎకనమిక్ ఎమర్జెన్సీ వైపు తీస్కెళ్లాయన్నది నిపుణుల అభిప్రాయం.

ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించాలన్నా… నిరుద్యోగాన్ని తగ్గించాలన్నా.. లేబర్ ఫ్రెండ్లీ వాణిజ్య నమూనాను సంస్కరించడం తప్పదని తేల్చేశారు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ హోలాండే. దీర్ఘకాలిక అభివృద్ధికి సరైన సంస్కరణలు అవసరమని తెలిపారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఆర్థిక చర్యలు ప్రతిపాదించారు. 5 లక్షల మందికి వృత్తినైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు బిలియన్ యూరోలతో నిరుద్యోగ నిధిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. మొత్తంగా నిరుద్యోగాన్ని తగ్గించడానికి.. ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ నివ్వాలంటే 2 బిలియన్ యూరోలు కేటాయించాల్సిన పరిస్థితి. దానికి ఎవరూ అడ్డుచెప్పకూడదంటే ఎమర్జెన్సీ తప్పదని డిసైడయ్యారు హోలాండే.

వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. మిగిలింది 15 నెలలే. మరోసారి అధికారంలోకి రావాలంటే ప్రజోపయోగమైన పనులు చేయాల్సిందేనని డిసైడయ్యారు హోలాండే. అందుకే ఎమర్జెన్సీ ప్రకటించారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy