ఫ్రీగా వాడేసుకోవటమే : హైదరాబాద్ లో 3వేల wifi స్పాట్స్

free wifi in hyderabad2నగరంలో హైఫై సేవలు ప్రారంభమయ్యాయి. వరల్డ్ వైఫై డే సందర్భంగా బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్ లో హైదరాబాద్ సిటీ హై-ఫై ప్రాజెక్టును ప్రారంభించారు మేయర్ బొంతు రామ్మోహన్. 3వేల ప్రాంతాల్లో వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి.  ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. మూడు వేల ప్రదేశాల్లో wifi అందుబాటులోకి తెచ్చిన సిటీగా హైద‌రాబాద్ దేశంలోని ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. వినియోగ‌దారుల‌కు మొదటి 30నిముషాలు ఉచితంగా wifi సేవలు అందుతాయని.. ఆ తర్వాత చార్జీలు ఉంటాయన్నారు. ఉచిత wifi సేవలు,  లొకేషన్స్ వివరాలు GHMC వెబ్‌సైట్‌లో ఉంచుతామ‌న్నారు. టూరిస్టులకు ఇది ఎంతగానో ఉపయోగకరమన్నారు మేయర్ బొంతు రామ్మోహన్. wifi  ద్వారా 10 mbps స్పీడుతో 30 నిమిషాలు ఉచితంగా వాడుకోవచ్చు. ఈ 3వేల ఫ్రీ wifi స్పాట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అనేది త్వరలోనే ప్రకటించనున్నారు. అందుకు సంబంధించిన పనులు మొదలయ్యాయని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy