ఫ్రీ, డిస్కౌంట్ ఆఫర్స్ గోవిందా : ఫిక్స్ డ్ రేట్లకు ప్రిపేర్ అవ్వండి

discontsరండి బాబూ రండి.. ఒకటి కొంటే ఒకటి ఉచితం. రెండు కొంటే మరో రెండు ఫ్రీగా పట్టుకెళ్లండి. మూడు కొంటున్నారా అయితే ఐదు ఉచితం. 5వేల రూపాయల వస్తువులు కొంటున్నారా.. మీకు ఇష్టమైన రెండు వేల వస్తువులు ఉచితం ఎత్తుకెళ్లండి.. రండి బాబూ రండి.. ఈ ఆఫర్ ఈ సీజన్ వరకే.. ప్రతి షాపింగ్ మాల్, ప్రతి షాపు దగ్గర దగ్గర కనిపించే బోర్డులు ఇవి. వినియోగదారులను ఆకర్షించటానికి వ్యాపారులు ఎంచుకునే మార్గం ఇదే. వెయ్యి రూపాయల చొక్కా కొంటే మరో వెయ్యి రూపాయల షర్ట్ ఎలా ఫ్రీగా ఇస్తారు అనేది కస్టమర్ కు అనవసరం.. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ కదా అనేదే ఆలోచిస్తాడు. ఇప్పటి వరకు బై వన్ – గెట్ వన్ ఫ్రీ, బై టూ – గెట్ త్రీ ఫ్రీ ఆఫర్స్ కు చెల్లు అయ్యింది. ఆయా కంపెనీలు వీటిని రద్దు చేస్తున్నాయి. ఇప్పటికే చాలా ఫుడ్ కంపెనీలు ఈ బాటలో ఉంటే.. మరిన్ని కంపెనీలు ఫ్రీ ఆఫర్స్ ను రద్దు చేయాలని నిర్ణయించాయి.

దీని కారణం GST. ఈ పన్ను విధానం అమల్లోకి వచ్చిన తర్వాత కస్టమర్ కు ఉచితంగా అందించే వస్తువుపైనా పన్ను చెల్లించాలి. అంతేకాకుండా ఉచితంగా వస్తువు ఇస్తున్నావు కాబట్టి ఇన్ పుట్ సబ్సిడీ వ్యాపారులకు రాదు. ఉచితంగా ఇవ్వటంతో పాటు పన్ను, ఇన్ పుట్ సబ్సిడీ కూడా వ్యాపారి కోల్పోవాల్సి ఉంటుంది. దీంతో వ్యాపారవర్గాలు ఇప్పుడు బై వన్ – గెట్ వన్ ఫ్రీకి గుడ్ బై చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా అతిపెద్ద బిస్కెట్, ఇతర ప్రాడక్ట్స్ విక్రయ కంపెనీ పార్లె ఇప్పటికే ఫ్రీ ఆఫర్స్ ను బంద్ చేసింది. కస్టమర్లకు డిస్కౌంట్ రూపంలో ఇవ్వాలని, ఉచితం లేదని ప్రకటించేసింది. ఈ బాటలోనే పిజ్జా, బర్గర్ అందించే డొమినోస్, యమ్ రెస్టారెంట్లు కూడా ఇదే ప్రకటన చేశాయి. రెండు పిజ్జాలు కొంటే మూడోది ఫ్రీ అని ఇప్పటి వరకు చెప్పాం.. ఇక నుంచి ఫ్రీ ఇవ్వలేం. కావాలంటే మూడో పిజ్జాకు డిస్కౌంట్ ఇస్తాం అని ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చేసింది డొమినోస్. మూడో పిజ్జా మీకు ఫ్రీగా ఇచ్చి.. మేం పన్ను కట్టాల్సి వస్తుంది. ఇన్ పుట్ సబ్సిడీ కూడా భరించాల్సి ఉంటుంది. ఇది కంపెనీకి నష్టం అంటున్నారు పిజ్జా హట్ మేనిజింగ్ డైరెక్టర్ ఉనాత్ వర్మ.

ఒక్క ఫుడ్ కంపెనీలే కాదు.. ఫార్మా కంపెనీలు సేల్స్ వ్యూహాలను మారుస్తున్నాయి. ఏదైనా వస్తువును ఉచితంగా అందించిన ప్రతిసారీ దాని విలువ GST పరిధిలోకి వస్తుంది.. దాన్ని వినియోగదారులపై వేయలేం. అలా అని కంపెనీ ఆ పన్నులు చెల్లించదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఉచిత ఆఫర్స్ కు రాం రాం చెబుతున్నామని ప్రకటించారు క్లియటాక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గుప్తా వెల్లడించారు. ఇక నుంచి MRP ధరలపైనే విక్రయాలు సాగుతాయని.. డిస్కౌంట్స్ కూడా ఉండవన్నారు.

జీఎస్టీ ఎఫెక్ట్ తో కొనుగోళ్లపై ప్రభావం చూపుతుందని.. కంపెనీలు సేల్స్ విషయంలో సరికొత్త వ్యూహాలు అనుసరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు నిపుణులు. ఇక నుంచి షాపింగ్ వెళ్లే వారు ఫ్రీ, డిస్కౌంట్స్ లేవని అని ముందుగా ప్రిపేర్ అయితే మంచిది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy