‘ఫ్రీ హగ్స్’ తో శాంతిని పమోట్ చేస్తున్న జపాన్ యవకుడు..

జపాన్ యువకుడు శాంతిని ప్రమోట్ చేస్తున్నాడు. కంట్రీల చుట్టూ తిరుగుతూ ఫ్రీ హగ్స్ ఇస్తున్నాడు. తాజాగా దానికి సంబంధించిన వీడియో నెట్ లో పెట్టాడు. ఈ వీడియో సోషల్ సైట్లలో హల్ చల్ చేస్తుంది. జపాన్ కు చెందిన కోచై కువాబరా ఈ ప్రొగ్రామ్ ను స్టార్ట్ చేశారు. జపాన్ కు చెందిన ఒక యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్  కంప్లీట్ చేసుకున్న ఈ యువకుడు సౌత్ కొరియా, చైనా, హంకాంగ్, తైవాన్ దేశాల్లో తన ఫ్రీ హగ్స్ ప్రొగ్రామ్ ను ప్రమోట్ చేశాడు . ఆయా దేశాల్లోని వీధుల్లో తిరుగుతూ శాంతి గురించి ప్రచారం చేశాడు. కనిపించిన ప్రతి ఒక్కరికీ హగ్స్ ఇచ్చాడు. పొలిటికల్ ప్రాబ్లమ్స్ తో పక్క పక్క దేశాలు శత్రుత్వాన్ని పెంచుకోకుండా శాంతితో మెలగడమే తన ఉద్ద్యేశమని చెప్తున్నాడు ఈ యువకుడు. తన వీడియోలను జనాలకు చూపించి మార్పు తెస్తా అంటున్నాడు. నెక్ట్స్ ఇయర్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ తో పర్యటిస్తానని చెప్తున్నాడు. జపాన్, చైనా, సౌత్ కొరియాకు చెందిన ప్రజలు కువాబరా ఆలోచనను మెచ్చుకున్నారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy