ఫ్రెండ్ షిప్ డే విషాదం : సీనియర్‌ను కొట్టి చంపిన జూనియర్లు..

chinnaవిశాఖపట్నంలోని మధురానగర్‌లో దారుణం వెలుగుచూసింది. స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్న చిన్నా అనే విద్యార్థిపై అదే పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నా(15) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రంగంలోకి దిగిన ద్వారక పోలీసులు దాడికి పాల్పడిన ముగ్గురు ఎనిమిదో తరగతి విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy