ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు

friendస్నేహం…. రెండక్షరాల తీయని పదం. కులం , మతం …..చిన్నా పెద్దా, ఆడా, మగా తేడా లేకుండా అందరినీ ఒక్కటి చేస్తుంది. ఎక్కడ పుట్టారో, ఎక్కడ పెరిగారో ఇలా ఒకరికొకరు తెలియదు. ఫ్రెండ్ షిప్ అనే చిన్న బంధం వారిని జీవితాంతం ఒక్కటిగా ఉంచుతుంది. మదర్స్ డే ఫాదర్స్ డే….. వాలంటేన్స్ డే మాదిరిగానే  స్నేహితులు కూడా ఫ్రెండ్ షిప్ డే జరుపుకుంటారు. ఇవాళ ఫ్రెండ్ షిప్ డే.

స్నేహితుడు… కష్టమైనా, కన్నీళ్లైనా పంచుకునేది నేస్తమే. అడుగడుగునా  అండగా నిలిచే ఆత్మబంధువు స్నేహితుడే. అవును స్నేహితుడు సంతోషాన్ని పంచుతాడు. భావాలను పంచుకుంటాడు. గతాన్ని గుర్తుకు చేస్తాడు. వర్తమానాన్ని వడ్డిస్తాడు.

స్నేహానికి ఉన్న గొప్పదనాన్ని వర్ణించటం ఎవరి తరం కాదు. స్నేహాన్ని స్వయంగా అనుభవిస్తేనే దానిలోని మాధుర్యం అర్ధం అవుతుంది. ఎవరి మాటలు వింటే ఆనందం కలుగుతుందో, ఎవరు దూరమైతే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయో, ఎవరు పక్కన లేకుంటే తీరని వెలితిగా వుంటుందో.. ఆ వ్యక్తే సిసలైన ఫ్రెండ్  అని చెప్పొచ్చు. ఎలా బతకాలో, ఎంత అందంగా జీవించాలో స్నేహం నేర్పుతుంది.

ఆగస్ట్ మొదటి ఆదివారం అనగానే  అందరికీ  వెంటనే గుర్తొచ్చేది స్నేహితుడు. ఎందుకంటే ఈ రోజు ఫ్రెండ్ షిప్ డే. జీవితంలో మనిషి అన్నవాడికి శత్రువు లేనివాడు ఉంటాడేమో కానీ స్నేహితులు లేని వారు ఉండరు.  రక్త సంబంధీకుల తర్వాత మనకు మొదటివాడు ఫ్రెండ్ . కన్నవారితో , కట్టుకున్న వారితో, తోబుట్టువులతో చెప్పుకోలేని వాటిని మనం స్నేహితుడితో పంచుకుంటాం. ఓ మంచి మిత్రుడుంటే లెక్కలేని సంపద మనతో ఉన్న ఆనందం కలుగుతుంది. అసలు ఫ్రతిఫలం ఆశించని వాడే త్యాగాన్ని కోరుకునేదే నిజమైన స్నేహం. మంచి మిత్రుడి కోసం వేటినీ లెక్కచేయకుండా అన్నింటిని త్యాగం చేస్తాం. అదీ స్నేహమంటే…. నిజమైన స్నేహమంటే.

స్నేహానికి వయసుతో సంబంధం లేదు. అసలు ఎప్పుడు, ఎవరితో, ఎలా ఈ స్నేహం కుదురుతుందో తెలియదు. నాటి పురాణాల నుంచి నేటి వరకు స్నేహానికి మించినది మరోటి లేదు. ద్వాపర యుగంలో కుచేలుడు ఇచ్చిన అటుకులకు బహుమతిగా క్రిష్ణపరమాత్ముడు బంగారు పట్టణాన్నే కానుకగా ఇచ్చాడు. అదీ స్నేహానికి ప్రతిఫలంగా కాదు. గుర్తుగా మాత్రమే. ఇక రామాయణంలో కీలక పాత్రధారుడైన  ఆంజనేయుడి తనకు మంచి మిత్రుడని స్వయంగా రాములోరే చెప్పిన సందర్భాలున్నాయి.

స్నేహితుల రోజు వెనక ఒక పెద్ద కధ ఉంది.1935  ఆగస్ట్ మొదటి శనివారం అమెరికా ప్రభుత్వం ఓ వ్యక్తిని కాల్చి చంపింది. ఈ విషయం తెలిసి తట్టుకోలేక  ఆ మరసటి రోజు  కాల్పుల్లో చనిపోయిన వ్యక్తి  స్నేహితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో  అమెరికా ప్రభుత్వం ఆగస్ట్ మొదటి ఆదివారాన్ని ఫ్రెండ్ షిప్ డే  గా ప్రకటించింది. ఆ విధంగా ఇది  ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.  1958 జూలైలో మొదటిసారిగా పరాగ్ లో ఫ్రెండ్ షిప్ డే ను చేసుకున్నారు.

స్నేహం అంతులేనిది. మంచి స్నేహం నిండు నూరేళ్లు వర్ధిల్లుతుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy