ఫ్లిప్ కార్ట్ షాక్ : కంపెనీకి సృష్టికర్త గుడ్ బై

sachin-bansal-filpkartభారతీయ అతిపెద్ద ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీ ఫ్లిప్ కార్ట్ లో షాకింగ్. ఎవరూ ఊహించని విధంగా ఆ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరు అయిన సచిన్ బన్సాలీ కంపెనీ నుంచి తప్పుకున్నారు. గుడ్ బై చెప్పారు. పదేళ్ల క్రితం ప్రారంభం అయిన ఈ సంస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లటంతో సచిన్ బన్సాలీదే కీలక పాత్ర. ఫ్లిప్ కార్ట్ లో మెజార్టీ వాటాను వాల్ మార్ట్ కు విక్రయించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పోటీగా అమెజాన్ కూడా రంగంలోకి దిగింది. ఈ రెండు కంపెనీల మధ్య పోటీ నడుస్తుంది. డీల్ విలువ తక్కువ అయినా ఫ్లిప్ కార్ట్ వైపే మొగ్గుచూపుతున్నారు బన్సాల్. ఎందుకంటే అమెజాన్ కంపెనీ నుంచి బయటకు వచ్చి ఫ్లిప్ కార్ట్ స్టార్ట్ చేశారు ఆయన. 2007లో  ఫ్లిప్ కార్ట్ కంపెనీని ప్రారంభించి.. 2016 వరకు ఆయనే సీఈవోగా ఉన్నారు.

ఫ్లిప్ కార్ట్ నుంచి వ్యవస్థాపకుల్లో ఒకరు సచిన్ బన్సాలీ తప్పుకోవటం మాత్రం కీలక పరిణామమే అంటున్నాయి మార్కెట్ వర్గాలు. డీల్ పూర్తి కాకుండా ఈ నిర్ణయం తీసుకోవటం వెనక ఉద్దేశాలు లేకపోలేదు అంటున్నారు. వాల్ మార్ట్ సంస్థకే.. ఫ్లిప్ కార్ట్ వాటాలను విక్రయించాలనే గట్టి పట్టుదలలో భాగంగానే.. వ్యూహాత్మకంగా ముందుగానే కంపెనీ నుంచి తప్పుకుంటున్నట్లు పారిశ్రామిక వేత్తల్లో ప్రచారం జరుగుతుంది. మెజార్టీ షేర్లను విక్రయించటం ద్వారా.. ఫ్లిప్ కార్ట్ లో తన వాటా 5శాతానికి పడిపోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బయటకు వస్తున్న బన్సాలీ.. కొత్త ప్రాజెక్ట్ చేపట్టనున్నట్లు బెంగళూరు సమాచారం.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy