బంగారు తెలంగాణకు జాగృతి కార్యాచరణ

mp-kavihaముఖ్యమంత్రి కేసీఆర్ సూత్రీకరించిన బంగారు తెలంగాణా సాధనకు తెలంగాణా జాగృతి సంస్థ అంకితమై పనిచేస్తుందని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పారు. జాగృతి స్థాపించి పదేళ్ళయిన సందర్భంగా నల్గొండలో రెండు రోజుల పాటు జరిగే దశమ వార్షికోత్సవ సమావేశాలను ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సారి కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితమవకుండా స్కిల్ డెవలప్ మెంట్, మహిళా సాధికారికత, చైతన్యకార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నాడు తెలంగాణా సాధన కోసం కేసీఆర్ స్ఫూర్తిగా ఈ జాగృతి ఉద్యమం ప్రారంభించామని, తొలినాళ్ళలో కేవలం 18 మంది మాత్రమే ఉండేవారని, నేడు ప్రతి జిల్లా, పల్లెల్లో విస్తరించి ఓ బ్రాండ్ గా తయారైందని కవిత తెలిపారు. మరుగున పడ్డ తెలంగాణా సంస్కృతికి జీవం పోసింది జాగృతేనన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా 3500 మంది కి శిక్షణనిచ్చామని చెబుతూ ఇకపై మహిళలకు మరింతగా వారు కోరుకుంటున్న రంగాల్లో శిక్షణనిస్తామని తెలిపారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy