బంగారు తెలంగాణ నిర్మించి చూపిస్తాం : సీఎం కేసీఆర్..

K.C.R gajwel01బంగారు తెలంగాణ నిర్మించి చూపుతామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. సీఎం హోదాలో తొలిసారి తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్ ను సందర్శించారు కేసీఆర్. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో పాల్గొన్నారు.   ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ కల సాకారమయిందన్నారు. మన రాష్ట్రంలో మనకు మేలు జరుగుతుందని ప్రజానీకం కోటి ఆశలు పెంచుకుందన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు అహర్నిశలు పనిచేస్తామన్నారు. తెలంగాణ అభివృద్ధికి కంకణం కట్టుకున్నట్లు తెలిపారు.తెలంగాణ అభివృద్ధి చెందాలంటే రాజకీయ అవినీతి అంతం కావాలాని పునరుద్ఘాటించారు. సీఎం హోదాలో తెలంగాణ ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నానని తెలిపారు. తెలంగాణ సత్వరాభివృద్ధి కోసం ప్రభుత్వం మూడు విధానాలు అవలంభించనున్నట్లు తెలిపారు.

మూడు ప్రభుత్వ విధానాలు :

  1. దళితులు, ముస్లింలు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం లక్ష కోట్ల రూపాయల ఖర్చు. అందులో 50 వేల కోట్లు కేవలం దళితుల సంక్షేమానికి ఖర్చు..
  2. వ్యవసాయానికి ప్రాధాన్యం.. రైతులకు ప్రత్యేక ప్రోత్సహకాలు..
  3.  బలహీన వర్గాలు ఆత్మగౌరవంతో  బతికేందుకు 125 గజాల స్థలంలో డబుల్ బెడ్ రూం నిర్మాణం.

ఉచిత నిర్బంధ విద్య నా కల :

తెలంగాణలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అందించడం తన కల అని అన్నారు సీఎం.  కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వమే ఉచిత విద్య సమకూరుస్తుందని తెలిపారు.  రాబోయే ఒకటి రెండేళ్లలో ఇది ప్రారంభమవుతుంది హామీ ఇచ్చారు. ఇక వైద్య రంగాన్ని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని, పేదలు కూడా ప్రైవేటు ఆసుపత్రులకు పోవాల్సి వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో 24 జిల్లాలు ఏర్పాటు చేస్తామని, ప్రతి జిల్లాకు నిమ్స్ తరహాలో ఒక ఆసుపత్రి నిర్మిస్తామన్నారు. వైద్యం కోసం  ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లడం మాని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రోజులు రావాలన్నారు. ఇక వ్యవసాయం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. రైతుల కమతాల ఏకీకరణ జరుపుతామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల కోట్ల రూపాయలు పంట రుణాలున్నాయని తెలిపారు. హామీల ప్రకారం పంట రుణాలు పది పన్నెండు రోజుల్లో మాఫీ చేస్తామని తెలిపారు. ఇక గజ్వేల్ నియోజక వర్గానికి వరాల జల్లులు కురిపించారు సీఎం. గజ్వేల్ ను అత్యంత అభివృద్ధి చెందిన నియోజక వర్గంగా డెవలప్ చేస్తామన్నారు. నియోజక వర్గం  చుట్టూ రింగ్ రోడ్డు నిర్మిస్తామన్నారు.  గజ్వేల్ ప్రజల కోసం ప్రత్యేక పీఏని ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో ఉంటానన్నారు. గజ్వేల్ పేదల కోసం ప్రత్యేక కలానీని త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాలనీలో పట్టణ పేదలందరికీ ఉచితంగా 5 వేల గృహాలు నిర్మిస్తామని తెలిపారు. ప్రజలంతా రాజకీయాలు పక్కన పెట్టి తెలంగాణ అభివృద్ధి కోసం పాటు పడాలని సూచించారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy