బంగ్లాకు భారీ టార్గెట్

India's captain Virat Kohli raises his bat for his double century (200 runs) on the second day of the Test cricket match between India and Bangladesh at The Rajiv Gandhi International Cricket Stadium in Hyderabad on February 10, 2017. ------IMAGE RESTRICTED TO EDITORIAL USE - STRICTLY NO COMMERCIAL USE----- / GETTYOUT / AFP PHOTO / NOAH SEELAM / ----IMAGE RESTRICTED TO EDITORIAL USE - STRICTLY NO COMMERCIAL USE----- / GETTYOUTహైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో  బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్…ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేసింది టీమిండియా. బంగ్లా బౌలర్లను ఉతికారేసింది. మూడు వికెట్ల నష్టానికి 356 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో సెకండ్ డే ఆట ప్రారంభించిన కోహ్లి గ్యాంగ్.. ఆరు వికెట్ల నష్టానికి 687 పరుగుల దగ్గర ఫస్ట్ ఇన్నింగ్ ను డిక్లేర్ చేసింది.

కెప్టెన్ విరాట్ కోహ్లి బంగ్లాదేశ్ పై చెలరేగిపోయాడు. 111 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో సెకండ్ డే ఆట ప్రారంభించిన కోహ్లీ… 246 బాల్స్ లో 204 రన్స్ చేశాడు. దీంతో మరో కొత్త రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా నాలుగు సిరీస్ ల్లో డబుల్ సెంచరీలు సాధించిన బ్యాట్ మెన్ గా చరిత్ర సృష్టించాడు. మరోవైపు గతంలో వరుసగా మూడు సిరీస్ ల్లో బ్రాడ్ మన్, ద్రవిడ్ లు చేసిన డబుల్ సెంచరీల రికార్డ్ ను దాటేశాడు కోహ్లీ.

వికెట్ కీపర్ సాహా 153 బంతుల్లో ఏడు బౌండరీలు, రెండు సిక్సర్లతో సెంచరీ చేశాడు. దీంతో ఫస్ట్ ఇన్నింగ్ స్ లో సాహా 106 పరుగులు, జడేజా 60 రన్స్ తో నాటౌట్ గా నిలిచారు. అటు రహానే 82 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర ఔటయ్యాడు.

తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన బంగ్లాదేశ్ కూల్ గా ఆడుతోంది. ఓపెనర్ సౌమ్య సర్కార్ ను 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర ఉమేశ్ యాదవ్ ఔట్ చేశారు. అయితే సెకండ్ డే 14 ఓవర్లు ఆడిన బంగ్లాదేశ్ వికెట్ నష్టానికి 41 రన్స్ చేసింది. ఓపెనర్ ఇక్బాల్ 24, మోమినుల్ హక్ ఒక్క పరుగుతో క్రీజులో ఉన్నారు.

మరోవైపు బంగ్లా టెస్ట్ మ్యాచ్ లో మరో రికార్డ్ ను క్రియేట్ చేసింది టీమిండియా. వరుసగా మూడు టెస్టుల్లో 6వందల పరుగులకు పైగా స్కోర్ సాధించి… చరిత్ర సృష్టించింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy