బంగ్లాదేశ్ లోనే జరగనున్న ఆసియా కప్ క్రికెట్

bangla

ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో బంగ్లాదేశ్ లో జరగాల్సిన ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ అక్కడే జరుగుతుందని టోర్నీ నిర్వాహకులు ఈ రోజు తేల్చి చెప్పారు. కొంత కాలంగా బంగ్లా లో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితులు, చెలరేగుతున్న హింసాకాండ వల్ల ఈ పోటీ వేరే చోటికి మార్చుతారన్న వార్తలు వస్తూ ఉన్నాయి. రేపు జరగనున్న ఎన్నికల నేపధ్యంలో బంగ్లా ముఖ్య నేతలైన షేక్ హసీనా, బేగం ఖాలేదా ల మధ్య అధికారం కోసం జరుగుతున్నయుద్ధాలు ఎలక్షన్లకే పరిమితం కాకుండా సామాన్య జీవితాన్ని కూడా కల్లోల పరుస్తున్నాయి. గత నెలలో వెస్టిండీస్ అండర్ 19 టీం తో జరుగుతున్నా మ్యాచ్ ఒకటి బాంబు పేలుళ్ళ వల్ల రద్దయి, ఆ టీం వెళ్ళిపోయింది. అప్పడినుండీ ఆసియా కప్ టోర్నీ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీలంక ఈ మధ్యే ఈటోర్నీ నిర్వహించడానికి ముందుకు వచ్చింది. పాకిస్తాన్ ఇంకా టోర్నీ లో పాల్గొనే విషయం నిర్ణయించుకోలేదు.

ICC 20twenty కూడా బంగ్లాదేశ్ లోనే జరగాల్సి ఉంది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy