బంజారాహిల్స్‌లో లారీ బీభత్సం

lorryహైదరాబాద్ బంజారాహిల్స్‌లో బుధవారం ఉదయం లారీ బీభత్సం సృష్టించింది. పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌ మీదుగా బంజారాహిల్స్‌ వైపు వెళ్తున్న కంకరలోడు లారీ రోడ్డు నెంబరు-2లో ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్‌ పైకెక్కి మధ్యలో నిలిచిపోయింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. బంజారాహిల్స్‌ రోడ్‌నంబర్‌-2లో ఇటీవల వరుసగా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కంకర లారీ డివైడర్‌పైకి ఎక్కడం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy