బంపర్ ఆఫర్: రూపాయికే చీర

saree_shopsరూపాయి చెల్లించండి చీర తీస్కెళ్లండి. ఇది ఏ పండుగ ఆఫర్ అనుకుంటున్నారా.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ వ్యాపారి ఇచ్చిన బంపర్ ఆఫర్. అయితే ఇది మనకు కాదు…కర్నాటకలో. త్వరలో ఎన్నికలు వస్తుండటంతో కర్ణాటకలో ఓ చీరల వ్యాపారి రూపాయికే చీర ఇస్తున్నారు. కుమారస్వామిని మరోసారి సీఎంగా చూడాలని అనుకుంటున్న బీదర్ వ్యాపారి చంద్రశేఖర్ పసరగే ఓటర్ ఐడీ చూపించండి.. రూపాయకే చీరను పట్టుకెళ్లండంటూ మహిళా ఓటర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.

రూ. 150 నుంచి రూ. 250 వరకు ధర పలికే చీరలను రూపాయి.. రెండు రూపాయలకే అందజేస్తామని చంద్రశేఖర్ ప్రకటించారు. ఓటర్ ఐడీ చూపిస్తే చాలు ఫ్రీగానైనా చీర తీసుకెళ్లమని చంద్రశేఖర్ చెబుతున్నారు. జనవరి 30 వరకూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ చీరలను పంపిణీ చేస్తామని తెలిపారు. 15 రోజుల్లో 5 లక్షల చీరలను అందజేస్తామని ప్రకటించడంతో.. చీరల కోసం మహిళలు షాపు ముందు భారీగా బారులు తీరారు.

బీదర్‌లో దాదాపు 45 వేల మందికి ఓటర్ ఐడీలు లేవు. దీంతో వారంతా ఓటు హక్కు నమోదు చేసుకొని, ఓటర్ ఐడీలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా ఓటర్ ఐడీ చూపించిన వారికి చీరలు అందజేస్తున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. ఇంత చేస్తే ఆయనకేం లాభం అనే కదా మీ డౌట్. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జేడీఎస్ టికెట్‌ను ఆశిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే కార్యక్రమాన్ని ఆ నాయకుడు ముందే ప్రారంభించారన్న మాట.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy