బంపర్ ఆఫర్ : రూ.999కే 4G స్మార్ట్ ఫోన్

mobil;e.రిలయన్స్‌ జియో 4జీ ఫీచర్‌ ఫోన్‌ను తీసుకురావడంతో ఇతర టెలికాం సంస్థలు కూడా మొబైల్స్ రేట్లను తగ్గిస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్‌, BSNL తక్కువ ధరకే ఫోన్‌లను తీసుకొచ్చేందుకు సర్వం సిద్ధం చేసుకున్నాయి. ఇప్పుడు దేశీ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘మైక్రోమాక్స్‌’.. ‘భారత్‌ 2 అల్ట్రా’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి ఆవిష్కరించింది. దీని ధర రూ.2,899.  అయితే వొడాఫోన్‌ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్‌ ఉంది. రూ.2,899 వెచ్చించి ఫోన్‌ను కొన్న కస్టమర్లు వొడాఫోన్‌ సిమ్‌ను (కొత్త/పాత కనెక్షన్‌) వాడితే రెండు విడతల్లో రూ.1,900 రిఫండ్‌ పొందొచ్చు.

కాకపోతే వొడాఫోన్‌ సిమ్‌ను మూడేళ్లపాటు ప్రతి నెలా కనీసం రూ.150లతో రీచార్జ్‌ చేసుకుంటేనే ఇది వర్తిస్తుంది. ఇలా చేసే యూజర్ల కు తొలి 18 నెలల తర్వాత రూ.900, తర్వాతి 18 నెలల తర్వాత మరో రూ.1,000 క్యాష్‌బ్యాక్‌ అంది… అది వొడాఫోన్‌ ‘ఎం–పైసా’ వాలెట్‌లో జమవుతుంది. స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.2,899లో రూ.1,900 క్యాష్‌బ్యాక్‌ను తీసేస్తే అప్పుడు రూ.999లకే ఫోన్‌ వచ్చినట్లు అవుతుంది.

మైక్రోమ్యాక్స్‌ భారత్‌-2 అల్ట్రా ఫీచర్లు          

* 4 జీబీ మెమరీ
*  512 ఎంబీ ర్యామ్
* 4 ఇంచెస్ స్క్రీన్
*  0.3 మెగాపిక్సెల్‌ ఫ్రంట్ కెమెరా
* 2 మెగాపిక్సెల్‌ కెమెరా
* ఆండ్రాయిడ్‌ 6.0
* 1300 ఎంఏహెచ్‌ బ్యాటరీతో పాటు ఓఎస్‌ వంటి ప్రత్యేకతలున్నాయని తెలిపింది మైక్రోమాక్స్‌.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy