బజాజ్ ఎలక్ట్రికల్స్‌ చైర్మన్‌ కొడుకు హఠాన్మరణం

ప్రముఖ వ్యాపారవేత్త, బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ చైర్మన్‌ శేఖర్‌ బజాజ్‌ కొడుకు అనంత్‌ బజాజ్‌(41) గుండెపోటుతో మృతి చెందారు. చిన్న వయసులోనే ఆయన నిన్న(శుక్రవారం) సాయంత్రం ఆరు గంటలకు ముంబైలో గుండెపోటుతో చనిపోయినట్లు ప్రకటించింది బజాజ్‌ఎలక్ట్రికల్స్‌ ఫ్యామిలీ. అనంత్‌ బజాజ్‌ అంత్యక్రియలు ఇవాళ కల్బదేవిలోని చందన్వాడి శ్మశానంలో నిర్వహించారు.

అనంత్‌ బజాజ్‌ రెండు నెలల క్రితమే బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. ఈ పదవిని అలంకరించడానికి కంటే ముందు, ఆర్గనైజేషన్‌లో జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గా పని చేశారు. 1999లో బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌లో ప్రాజెక్ట్‌ కో-ఆర్డినేటర్‌గా  తన కెరీర్‌ను ప్రారంభించారు అనంత్‌. హై-టెక్‌ అప్లియెన్సస్‌ అభివృద్ధి చేయడానికి బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ లోనే రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన పాత్ర కీలకం. అదేవిధంగా ముంబైలో డిజిటల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. అనంత్‌ ఇండియన్‌ మెర్చంట్స్‌ ఛాంబర్‌లో యంగ్‌ ఎంటర్‌ప్రిన్యూర్‌ వింగ్‌కు సభ్యుడు. గ్రీన్‌పీస్‌ ఆర్గనైజేషన్‌లో కూడా అతను సభ్యుడే. పలు ఇతర కంపెనీల్లో కూడా అనంత్‌ బోర్డు డైరెక్టర్‌గా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy