‘బట్ట తల’కు మూడింది!

baldy

బట్ట తల కప్పి పుచ్చుకునేందుకు విగ్గులు, నొప్పి కలిగించే ప్లాంటేషన్ వంటి అడ్డ దార్లు వెతుక్కునే స్థితి తొందర్లోనే తప్పవచ్చు. కాలిఫోర్నియా లోని కొందరు పరిశోధకులు ఈ సమస్యకు కొత్త మార్గాన్ని కనిపెట్టామంటున్నారు. వెంట్రుకల కుదుర్లలో ఉండే hfSCs లనే మూల కణాలతో పాటు వీటిని ప్రేరేపించే Wnt7b అనే జన్యు సమూహం, ఇవి సమాచారం పంపించే BMP, Wnt అనే మార్గాలను ప్రభావితం చేసే పద్ధతులను వీరు కనుగొన్నారు. దీనివల్ల వెంట్రుకలు ఏర్పడే స్థానం, వాటి పొడవు, వెంట్రుకల అడుగున ఉండే చర్మం పెరుగుదలను కూడా ప్రభావితం చేయవచ్చట. కాలిన చర్మం బాగు చేయడంలోనూ, కొన్ని రకాల చర్మ కాన్సర్ లను నయం చేయడం లో కూడా ఈ పరిశోధన ఫలితాలు ఉపయోగపడతాయట!

బాల్డ్ నెస్ ట్రీట్మెంట్ ల పేరుతో జీవితం గడిపేస్తున్న నాటు వైద్యుల దగ్గరనుంచి కోట్లాది రూపాయల సామ్రాజ్యాలు స్థాపించిన దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ వార్తను హర్షించక పోవచ్చు, విగ్గుల తయారీదారులు కూడా దీనిపై నిరసన తెలుపుతారేమో? కానీ తలపై జుట్టు ఉంటేనే అందం, మగతనం అనుకునే చాలామంది మాత్రం ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతారని చెప్పవచ్చు!

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy