బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం

etela
రాష్ట్ర వార్షిక బడ్జెట్ (2018-2019)కు మంత్రివర్గం అమోదం తెలిపింది. హైదరాబాద్ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. వార్షిక బడ్జెట్‌తో పాటు వివిధ బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రేపు(గురువారం,మార్చి-15)  ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు : 

…కొత్త పోలీస్ విధాన బిల్లు
… డీజీపీ నియామక అధికారాలు రాష్ట్రానికే ఉండేలా కొత్త విధానం
…పీజీ వైద్య విద్యార్థులకు ఒక ఏడాది ప్రభుత్వ సర్వీసు నిబంధన తొలగింపు బిల్లు
… నీటి పారుదల శాఖలో మరో కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం
…హైదరాబాద్ విదేశీ భవన నిర్మాణానికి 2 ఎకరాల భూమి
… సాయి సింధు ఫౌండేషన్ కు 15 ఎకరాల స్థలం
…రాచకొండ పోలీసు కమిషనరేట్ కు 56 ఎకరాల స్థలం.

… చనాఖా- కొరాట ప్రాజెక్టు పరిధిలో 2 రిజర్వాయర్ల నిర్మాణం
… ఆరోగ్య శ్రీ పరిధిలోకి జర్నలిస్టు, ఉద్యోగుల హెల్త్ స్కీమ్ చేరుస్తూ మంత్రి వర్గం నిర్ణయాలు తీసుకుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy