బడ్జెట్ తాయిలం : సర్కారీ దవాఖానాల్లో మందులన్నీ ఫ్రీ

Government General Hospitalగవర్నమెంట్ హాస్పిటల్లలో ఉచిత మందుల పంపిణీకి రంగం సిద్ధం చేస్తోంది వైద్యశాఖ. రోగనిర్ధారణ పరీక్షలతో పాటు.. అన్ని రకాల మందులను ఉచితంగా అందించేందుకు అవసరమైన బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు వైద్యఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి. అంతేకాదు.. ఆపరేషన్ థియేటర్లను ఆధునీకరించి.. సౌకర్యాలను పెంచాలని సూచించారు. అత్యవసర సేవల కోసం వచ్చిన ప్రతి రోగికి పూర్తిగా ప్రభుత్వ వైద్యశాలల్లోని అన్నిరకాల చికిత్సలకు ఏర్పాట్లు చేయాలన్నారు. 2017-18 బడ్జెట్‌ అంచనాలపై సమీక్ష సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

  • వచ్చే ఏప్రిల్‌ నుంచి అన్నిరకాల మందులూ పంపిణీ
  • రోగ నిర్ధారణ కేంద్రాలకు అవసరమైన వైద్యపరికరాలు అందేలా ఏర్పాట్లు
  • మాతాశిశు సంరక్షణలో భాగంగా కొత్తగా జన్మించిన పిల్లల కోసం కిట్లు
  • ప్రభుత్వాసుపత్రులలో ప్రసూతుల కోసం ఎక్కువ మందిని చేర్చేందుకు వీలుగా ప్రత్యేక ప్రోత్సాహకాలు
  • కొత్త జిల్లాకేంద్రాల్లో పెద్దాసుపత్రుల ఏర్పాటు
  • ప్రస్తుతం వాటిల్లో ఏరియా ఆసుపత్రులుంటే వాటిస్థాయిని పెంచుతారు.
  • కొత్త భవనాలు అవసరమైతే వాటి నిర్మాణాలకు నిధులు కేటాయింపు
  • 108 అత్యవసర వాహనాలు మరిన్ని కొనుగోలు
  • మృతదేహాలను తరలించే వాహనాల సంఖ్య మరింత పెంపు

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy