బతుకమ్మ ముగింపు వేడుకలకు భారీ ఏర్పాట్లు

Bathukamma-1బతుకమ్మ ముగింపు వేడుకలను గ్రాండ్ గా ప్లాన్ చేసింది సర్కార్. ట్యాంక్ బండ్ పై నిర్వహించే ముగింపు ఉత్సవాలకు అంతా రెడీ చేస్తోంది. ఏర్పాట్ల నిర్వాహణ కోసం ఉన్నత స్థాయి కమిటీలను నియమిస్తూ ఉత్త ర్వులు జారీ చేసింది. తెలంగాణ చరిత్ర , బతుకమ్మ సంస్కృ తి, కళలను చాటేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణ యించింది సర్కార్.

రాష్ట్రంలో పువ్వులను పూజించే గొప్ప పండుగ బతుకమ్మ. మన రాష్ట్ర పండుగ. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండోసారి అధికారికంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తోంది సర్కార్. ఈనెల 12న ప్రారంభమైన బతుకమ్మ ఉత్సవాలు 20న ముగియనున్నాయి. గతేడాదిలాగే  ట్యాంక్ బండ్ పై ముగింపు వేడుకలను గ్రాండ్ గా జరపాలని నిర్ణ యించింది సర్కార్. అట్టహాసంగా నిర్వహించే ఈ వేడుకలకు గవర్నర్, సీఎం దంపతులతో పాటు, మంత్రులు ఇతర వీఐపీలు, మహిళలు హాజరుకానున్నారు.

ముగింపు వేడుకల్లో తెలంగాణ బతుకు చిత్రం ఆవిష్కరించేలా ప్లాన్ చేసింది ప్రభుత్వం. మన చరిత్ర ను దశ దిశలా చాటే కళారూపాలు, శకటాల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తోంది. మంగళవారం సాయంత్రం వేల బతుకమ్మలతో ఎల్బీస్టేడియం నుంచి మహిళలు ర్యాలీగా టాంక్ బండ్ కు వస్తారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు. స్పెషల్ లైట్ సెట్టింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ కాంతుల వెలుగుల్లో భాగ్యనగరం మెరిసిపోతుంది. అన్ని జంక్షన్లలో పెద్ద పెద్ద బతుకమ్మలు దర్శనమిస్తున్నాయి. ముగింపు వేడుకలకు రెండు రోజులే ఉండటంతో పనులు స్పీడప్ చేసింది సర్కార్. ఉన్నతాధికారుల తో పది కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ సలహాదారు రమాణాచారి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ కమిటీలను నియ మించింది. హుస్సేన్ సాగర్ సుందరీకరణ పనులు టూరిజం ఎండీ మానిటర్ చేస్తున్నారు. ఎల్బీ స్టేడియం లో పూలు, ఇతర ఏర్పాట్లను హైదరాబాద్ కలెక్ట ర్ చూస్తున్నారు. టాంక్ బండ్ పై ఏర్పాట్లను రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ వరకు జరిగే బతుకమ్మ , కళా ప్రదర్శనలకు IFS సునిత భగవత్ నేతృత్వంలో కమిటీని నియమించింది. ఇక ట్యాంక్ బండ్ పై సీటింగ్ అరేంజ్ మెంట్ కు ప్రొటోకాల్ డిపార్ట్ మెంట్ ను సూపర్ వైజ్ చేసింది. భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి, టపాసులు పేల్చే కార్యక్రమాన్నిమార్కెటింగ్ డైరెక్ట ర్ శరత్ పర్యవేక్షిస్తున్నారు. ఈ మొత్తం పనులను టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం సమన్వయం చేస్తున్నారు. ముగింపు వేడుకల్లో ఎక్కడా ఇబ్బందులు రాకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తుంది సర్కార్.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy