బద్ధకంగా ఉండటం కూడా వ్యాధే…!

చాలామంది బద్ధకంగా ఉందని పనులు ఎగ్గొడుతుం టారు. ఇంట్లోనే ఉండి టీవీలు, సెల్‌‌ఫోన్లతో టైం పాస్ చేస్తుంటారు. బద్ధకంగా ఉందని  ఒకట్రెండు రోజులు అంటే పర్లేదు. అలా కాకుండా రోజుల తరబడి, వారాల తరబడి బద్ధకంగా ఉంటుందని అంటున్నారంటే మాత్రం ఖచ్చితంగా అదో వ్యాధే అంటున్నారు సైకాలజీ ఎక్స్ పర్ట్స్. తినడం, పడుకోవటం, ఇంటి నుంచి బయటకు వెళ్లకపోవటం లాంటివి బద్ధకస్తులు చేసే పనులు. కొంతకాలంగా ఏ పనీ చేయబుద్ధి కావటం లేదని చెప్తున్నారంటే…వాళ్లు ఖచ్చితంగా బద్ధకం అనే వ్యసనానికి అలవాటు పడ్డారనే చెప్పొచ్చు. నిరాశ, నిస్పృహ, ఆత్మవిశ్వాసం లేకపోవటం, శరీరం నీరసంగా ఉండటం… అన్నీ బద్ధకం లక్షణాలే. బద్ధకంగా మనిషి తయారు కావడానికి అనేక కారణాలు ఉండొచ్చు.

ఆర్థికంగా బాగాలేకపోవటం, అనారోగ్యంతో బాధపడటం, సమస్యల్లో చిక్కుకోవటం లాంటి కారణాల వల్ల కూడా బద్ధకానికి అలవాటు పడొచ్చు. పైకి గంభీరంగా కనిపిస్తూ మాటలు చెప్పేవాళ్లు, లోపల భయంతో ఉండొచ్చు. తప్పులను ఒప్పుకునే ధైర్యం లేని వాళ్లు బద్ధకం పేరిట పనిబాట లేకుండా తిరగొచ్చు. బద్ధకంతోనే జీవితాన్ని వెళ్లదీయాలనుకుంటే అవమానాలు ఎదుర్కోక తప్పదు. ఇంట్లోనే కాదు స్నేహితులు, బంధువుల దగ్గర విలువ ఉండదు. లక్ష్యం లేని మనిషి  ఎందుకు పనికిరాడు. కాబట్టి బద్ధకాన్ని వదిలి సమస్యలను పరష్కరిం చుకోవాలి. అయినా బద్ధకం పెరిగిపోతుందనిపిస్తే తప్పని సరిగా కౌన్సెలిం గ్‌ తీసుకోవాలి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy