బద్ధ శత్రువులు కలిశారు.. చెరో 38సీట్లు పంచుకున్న ఎస్పీ, బీఎస్పీ

లక్నో: ఒకప్పటి బద్ధ శత్రువులు ఎస్పీ, బీఎస్పీ ఉత్తరప్రదేశ్ లో పొత్తు కుదుర్చుకున్నాయి. ఈ ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్లో చెరో 38 సీట్లలో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. మరో రెండు సీట్లను మిత్రపక్షాలకు ఇస్తున్నట్లు ప్రకటించాయి. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ గెలిచిన రాయబరేలి సెగ్మెంట్లలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాయి. రాష్ర్టంలో మొత్తం 80 లోక్‌‌‌‌‌‌‌‌సభ సీట్లు ఉన్నాయి. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతి శనివారం ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీట్ల పంపకానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిం చడమే టార్గెట్ చేసుకుని ఎస్పీ, బీఎస్పీలు గ్రాండ్ అలయన్స్ గా ఏర్పడ్డాయి. అయితే కాంగ్రెస్ కు మాత్రం కూటమిలో చోటు కల్పించలేదు. కాంగ్రెస్ ను పొత్తుకు దూరం పెట్టడంపై బీఎస్పీ చీఫ్ మాయావతి వివరణ ఇచ్చారు. అలయన్స్ లో కాంగ్రెస్ ఉన్నా ఆ పార్టీ ఓట్లు మిగతా మిత్రపక్షాలకు పడవని ఆమె చెప్పారు. గతంలో జరిగిన అనేక ఎన్నికల్లో ఈ విషయం రుజువైందన్నారు. దీంతో కాంగ్రెస్ లేకుండానే అలయన్స్ ఏర్పాటు చేయాలని అఖిలేశ్ తో కలిసి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాయావతి చెప్పారు.  దేశ ప్రయోజనాల కోసమే ఎస్పీతో తాము జత కట్టినట్లు చెప్పారు.

బీజేపీ, కాం గ్రెస్ దొందూ దొందే

అనేక అంశాల్లో కాంగ్రెస్, బీజేపీ ఒకే విధానాన్ని అవలంబిస్తున్నాయని మాయావతి ఆరోపించారు. కాంగ్రెస్, దేశంలో ఎమర్జెన్సీ విధిస్తే బీజేపీ హయాంలో ఎమర్జెన్సీ పరిస్థితులే ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్నా ప్రజల కోసం చేసిందేమీలేదని మండిపడ్డారు. నిజానికి కాంగ్రెస్ హయాంలోనే దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగాయన్నారు. అన్ని రంగాలు అవినీతిమయమయ్యాయని మాయావతి ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి తీరుతామని మాయావతి అన్నారు. కోట్లాదిమంది ప్రజలు, మోడీ సర్కార్ పై అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీ ప్రభుత్వంపై ఉన్న ఈ అసంతృప్తిని ఓట్లుగా మలచుకోవడానికే తాము ప్రయత్నిస్తున్నామని ఆమె చెప్పారు. సమాజ్ వాది పార్టీతో తమ పొత్తు కేవలం లోక్ సభ ఎన్నికలకే పరిమితం కాదని బీఎస్పీ చీఫ్ చెప్పారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అలయెన్స్ కొనసాగుతుందన్నారు. ‘1993లో అప్పటి బీఎస్పీ చీఫ్ కాన్షీరాం , ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కలిసి యూపీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు మేమిద్దరం కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. పేదలు, కార్మికు లు, రైతులు, మహిళలు, వెనుకబడిన వర్గా లు,దళితులు, మైనారిటీల ప్రయోజనాల కోసమే గ్రాండ్ అలయన్స్ ఏర్పాటైంది’ అని మాయావతి అన్నారు.

ప్రధాని రేసులో మాయావతికి మద్దతు

ఈ సందర్భంగా లోక్ సభ ఎన్ని కల తర్వాత ప్రధాని పదవికి మాయావతికి మద్దతు ఇస్తామన్న సంకేతాలు అఖిలేశ్ యాదవ్ ఇచ్చారు. ‘యూపీ నుంచి గతంలో చాలా మంది ప్రధానులయ్యారు. ఈసారి కూడా ఎవరైనా పీఎం అయితే మాకు సంతోషమే’  అని అఖిలేశ్ కామెంట్ చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy