బప్పా మోరియా : తుది రూపులో ఖైరతాబాద్ మహా గణపతి

khrtabd-ganeshగణపతి నవరాత్రి ఉత్సవాలకు ఖైరతాబాద్ గణనాథుడు రెడీ అవుతున్నాడు. ఈఏడాది 60 అడుగుల ఎత్తులో… శ్రీచండీ కుమార అనంత మహాగణపతి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. శుక్రవారం (ఆగస్టు 25)న వినాయక చవితి పండుగ వస్తుండటంతో…పండుగకు రెండు రోజుల ముందే విగ్రహ నిర్మాణ పనులు పూర్తయ్యేలా పనులు జోరుగా సాగుతున్నాయి.

ఈసారి కూడా భారీ వినాయ విగ్రహాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు శిల్పులు. 1954ల ఒక అడుగుతో ప్రారంభమైన గణేష్ ఉత్సవ కమిటీ.. ఈఏడాది 63 సంవత్సరంలో అడుగుపెట్టింది. ఉత్సవ కమిటీ ఏర్పడి 63 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 60 అడుగుల భారీ వినాయకుడిని ఏర్పాటు చేస్తోంది.

విగ్రహం వెనక నుంచి పై భాగం  వరకు పచ్చని  చెట్టుతో పాటు కుడివైపు కుమార స్వామి ..ఎడమవైపు దుర్గామాత విగ్రహాలు గణపతితో పాటు  కొలువుతీరనున్నాయి. ఎడమవైపు మండపంలో మహాకాళ శివుడు,  కుడివైపు మండపంలో మహిషాసుర మర్ధిని భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

వినాయకుడి ఎత్తు మొదట 58 అడుగుల అనుకున్నామని కానీ… భక్తుల కోరిక మేరకు 60 అడుగుల  విగ్రహాన్ని తయారు చేస్తున్నామని తెలిపారు ఉత్సవ కమిటి సభ్యులు. మరో 15 రోజుల్లో విగ్రహా నిర్మాణ పనులు కానున్నట్లు తెలిపారు. ఈ నెల 22 నుంచి భక్తులకి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం కూడా ఏర్పాట్లకు సహకరిస్తుందని చెప్పారు కమిటి సభ్యులు.

ఈ ఏడాది కూడా వినాయక విగ్రహానికి వెనక భాగంలో 5 పడగల పాము ఆకారం ఉంటదన్నారు శిల్పి రాజేంద్రన్. దాదాపు 150 మంది వర్కర్లు 4 నెలలుగా విగ్రహా తయారీ పనులు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 70 శాతం పనులు పూర్తిచేశామని మరో 15 రోజుల్లో విగ్రహా నిర్మాణం పూర్తవుతుందన్నారు.

ఈ సారి కూడా తాపేశ్వరం నుంచి తీసుకొచ్చే లడ్డూనే వినాయకుడికి మహాప్రసాదంగా పెట్టనున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy