బయట తాగారో బుక్కయినట్టే

 ట్విన్ సిటీస్ లో పబ్లిక్ ప్లేసుల్లో తాగుతున్న మందుబాబుల పై ఎక్సైజ్ అధికారులు నజర్ పెట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్ డ్రైవ్ ని చేపడుతున్నారు. ఇందులో భాగంగా మందు షాప్ ల వద్ద పర్మిట్ రూమ్స్ లో మినహాయిస్తే పబ్లిక్ ప్లేస్ లు, జనాలున్న చోట, పార్కులు, సినిమా హాల్స్, రైల్వేస్టేషన్, బస్టాండులు, ఆటోల్లో కూర్చుని మందు తాగుతున్న వారిపై కఠినంగా వ్యవహరించేందుకు ఎక్సైజ్ టీమ్స్ గస్తీ తిరుగుతున్నాయి.

ఈ ప్రాంతాల్లో ఎక్కువ..
ట్విన్ సిటీస్ లో జూబ్లీహిల్స్‌, అమీర్ పేట, దూల్ పేట, పంజాగుట్ట, బేగంటపేట, నాంపల్లి తదితర ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటిని తర్వాత పబ్లిక్ ప్లేసుల్లో మందు తాగుతున్న కొందరిపై ఎక్సైజ్ పోలీసులు గతంలో కేసులు పెట్టారు. ఆ సమయంలో సదరు మందుబాబులు ఎక్సైజ్‌ అధికారులతో ఘర్షణకు కూడా దిగినట్లు సమాచారం. సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌, మలక్ పేటలలోనూ పబ్లిక్ గా మందుకొడుతున్న వారిని కేసులు నమోదు చేశారు అధికారులు. ట్విన్ సిటీస్ లో సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు, దత్తరాజుగౌడ్‌ నేతృత్వం లో 11 ఎక్సైజ్‌ స్టేషన్లలో ఎన్ ఫోర్స్ మెంట్‌, సీ ఐ, ఎస్సై, సిబ్బందితో ఏర్పాటైన స్పెషల్ టీమ్స్ పలు సెంటర్లలో గస్తీ చేపట్టింది. ఈ క్రమంలో లిక్కర్‌ అమ్మకాలు ముగిసి, అర్ధరాత్రి దాటిన తర్వాత బహిరంగా మద్యం సేవిస్తున్న మందుల బాబులను గుర్తించి, వారిని అదుపులోకి తీసుకుని ఫైన్ వేయడంతో పాటు కేసులునమోదు చేశారు.

1276 మందిపై కేసులు..
హైదరాబాద్‌ పరిధిలో గతేడాది డిసెంబర్‌ 31వ తేదీ వరకు అమీర్ పేట – 104, జూబ్లీహిల్స్‌ – 74, నాంపల్లి -94, గోల్కొండ – 120, దూల్ పేట – 305, చార్మినార్ – 188 కలిపి మొత్తంగా 885 కేసులు నమోదు అయ్యాని ఎక్సైజ్ అధికారులు చెప్పారు. సికింద్రాబాద్‌ పరిధిలో కాచిగూడ – 72, నారాయణగూడ- 80, ముషీరాబాద్‌ – 84, సికింద్రాబాద్‌ – 90, మలక్ పేటలలో- 65 కలిపి మొత్తంగా 391 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఫైన్ల రూపంలో హైదరాబాద్ లో రూ.4లక్షల 42వేలు, సికింద్రాబాద్ పరిధిలో రూ.లక్షా 95వేల 500తో కలిపి రూ.6లక్షల 37వేల 500 వసూలు చేశామన్నారు. ఇదిలా ఉండగా ఇకపై పబ్లిక్ ప్లేసుల్లో మందు తాగి దొరికితే కేసులు నమోదు చేయడమే కాకుండా అవసరమైతే జైలుకి తరలించాలన్న దానిపై ఎక్సైజ్ అధికారులు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy