బరితెగించేశారు : పోలీస్ ను రోడ్డుపై పరిగెత్తించి కొట్టిన పేకాటరాయుళ్లు

policeశాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులకే రక్షన లేకుండా పోతుంది. పేకాట ఆడటం తప్పన్నందుకు పోలీసుని చితకబాదారు. ఈ దారుణ సంఘటన సోమవారం (మార్చి-19) కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. పేకాట స్థావరంపై దాడి చేసిన ఓ పోలీసును పేకాటరాయుళ్లు చితకబాదారు. నడిరోడ్డుపై పరుగులు పెట్టిస్తూ పేకాటరాయుళ్లు కొడుతుంటే పక్కన ఉన్నోళ్లంతా ప్రేక్షకుల పాత్ర పోషించడం గమనార్హం.

దుండగుల నుంచి తప్పించుకునేందుకు పోలీస్ పెట్టిన పరుగులతో ఆ ప్రాంతం అంతా బీభత్సంగా మారింది. అక్కడున్న వారెవరూ దుండగులను అడ్డుకోలేకపోయారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పోలీస్ ను.. ఆస్పత్రికి తరలించారు. ఖాకీని కొట్టిన వారిలో నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిపై ఇప్పటికే పలు దొంగతనం కేసులు ఉన్నాయి.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యింది. పేకాట ఆడటమే తప్పు.. అడ్డుకున్న పోలీస్ ను ఇలా రోడ్డుపై పరిగెత్తించి మరీ కొట్టటంపై బెంగళూరు పోలీసులు సీరియస్ గా ఉన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy