బరువెక్కిన స్కూలు బ్యాగులు

schoolచిన్నారులకు టెక్ట్స్ బుక్స్ భారంగా మారాయి. రోజూ.. వారి బరువుకు మించిన భారాన్ని మోస్తున్నారు విద్యార్థులు. టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్ తో పాటు.. టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్ తో కలుపుకొని ఒకటో తరగతిలోనే 5 నుంచి 7 కేజీలకు పైగా బరువును మోయాల్సి వస్తోంది. వాస్తవానికి.. విద్యార్ధి బరువును బట్టి అన్నిరకాల బుక్స్ తో బ్యాగ్ వెయిట్ 10 శాతం ఉండాలని నిబంధన ఉంది. కానీ..ఆ పరిస్థితి ఏ స్కూల్ విద్యార్ధికి వర్తించడం లేదు.

చిన్నారుల బుజాలపై కేజీల కొద్దిబరువుతో.. బస్తాను తలపించేలా పుస్తాల బ్యాగ్ ఉండనిదే స్కూల్ టీచర్లు చదువు నేర్పలేరా.. అని అనుమానం కలుగుతోంది. స్కూల్స్ నే తప్పుపట్టడానికి లేదు. పర్యవేక్షణ చేసే విద్యాశాఖా అధికారులు ఏమయ్యారని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. స్కూల్ యాజమాన్యాన్ని నిలదీస్తే.. తప్పు తమది కాదంటే, తమది కాదని.. చెబుతున్నారంటున్నారు పేరెంట్స్.

క్లాస్ ను బట్టి బుక్స్ మారుతున్నా..చిన్నవయస్సులోనే అధికంగా మోయాల్సి రావడంతో స్టూడెంట్స్ హెల్త్ పై అధిక ప్రభావం పడుతోంది. 5వ తరగతిలోపు విద్యార్ధుల స్కూల్ బ్యాగ్ బరువు నిబంధనలకంటే 40 నుంచి 60 శాతం అధికంగా ఉంటోంది. అధిక బరువు మోస్తుండటంతో, వెన్ను నొప్పితో పాటు ఎదుగుదల లోపిస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

చదువు నేర్పేందుకు నాలుగు పుస్తకాలు సరిపోతాయిని అధికారులు చెబుతున్నా, ప్రైవేటు పాఠశాలల మాత్రం వివిధ సాకులతో నిబంధనలు పెడచెవిన పెడుతున్నాయి. సొంతంగా పుస్తకాలను ప్రింట్ చేయిస్తూ, అధిక ధరలకు అమ్మడంపై విమర్శలొస్తున్నాయి. ఎడ్యుకేషన్ లో కాంపిటీషన్ తోనే బుక్స్,నోటు పుస్తకాలు ఎక్కువ పెంచుతున్నామంటున్నాయి కొన్ని యాజమాన్యాలు. తక్కువ పుస్తకాలతో పాఠాలు చెబితే.. స్కూల్స్ సరిగా చెప్పడం లేదంటున్నారని చెబుతున్నారు.

అయితే ప్రభుత్వ స్కూల్స్ లో మాత్రం ప్రైవేట్ తో పోల్చితే, చాలావరకు బుక్స్,టెక్స్ బుక్స్ తక్కువగా ఉంటాయి. దీంతో ఇక్కడ చదివే విద్యార్ధులు అధిక ఒత్తిడికి లోనుకావడం లేదన్నది వాస్తవం. ఐతే.. గతంతో పోల్చితే ఈమధ్య సీసీఈ విధానం అమలులోకి వచ్చాక బుక్స్ తక్కువగా ఉన్నా,నోట్ బుక్స్,హోంవర్క్స్ చేయించడం పెరగడంతో రిజల్ట్ బాగా పెరుగుతోంది. మంచి రిజల్ట్ రావడానికి బుక్స్ ఎక్కువగా ఉండటానికి సంబంధం లేదంటున్నారు ప్రభుత్వ టీచర్స్.

ప్రాథమిక పాఠశాల విద్యార్ధి బ్యాగ్ బరువుపై ఎన్నోఏళ్లుగా చర్చనీయాంశం కాగా, చర్యలు తీసుకునేందుకు చట్టాలు సరిగ్గా లేకపోవడంతో విద్యార్ధులకు బరువైన బ్యాగు నుంచి విముక్తి కలగడం లేదు. ఈ ప్రాబ్లమ్ ను రాష్ట్రాల్లో తీర్చేది కాకపోవడంతో గతంలో దేశవ్యాప్తంగా మార్పుతీసుకొచ్చేందుకు పలువురు ఎంపీలు ఏకంగా పార్లమెంటులోనే చర్చకు పట్టుపట్టి, యశ్ పాల్ లాంటి కమిటీలు వేసేందుకు కారణమయ్యారు. సరైన చట్టాలు లేకపోవడంతో విద్యాశాఖ చూసిచూడని వైఖరితో విద్యావిధానంపై తీవ్ర ప్రభావం పడుతోంది. గతంలో ఇంతగా బుక్స్ మోయకుండానే, ఉన్నత స్థాయికి చేరినవారున్నారని చెబుతున్నారు విద్యావేత్తలు. స్కూల్స్ లో పకడ్బంధీగా నిబంధనలు అమలు చేయాలని కోరుతున్నారు.

స్కూల్ బ్యాగుల బరువు తగ్గించేది రాష్ట్రాల పరిధి కాకపోవడంతో.. పార్లమెంటులో ఎంపీలు పట్టుబట్టి యశ్ పాల్ కమిటీ వేసేందుకు కారణమయ్యారు. బ్యాగ్ వెయిట్ తగ్గించేందుకు ముందుగా సీబీఎస్ఈ స్కూల్స్ కొత్త నిబంధనలు అమలు చేయాలని చూస్తోంది. కేంద్రం త్వరలో రాబోయే కొత్త చట్టంతోనైనా.. విద్యార్థుల భారం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు విద్యావేత్తలు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy