బల్లాలదేవ (రాణా) పరకాయ ప్రవేశం

ranaటైటిల్ చూసి ఆశ్చర్యం.. వింతగా అనిపించొచ్చు. ఈకాలం హీరో నాలుగు ఫైట్లు, నాలుగు సాంగ్స్ చేసి వెళ్లిపోతున్న రోజుల్లో ఓ యంగ్ హీరో.. అందులోనూ విలన్ క్యారెక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేయటం అంటే అసమాన్యం. కానీ వాస్తవంగా ఇది అక్షర సత్యం అంటోంది బాహుబలి టీం. V6 న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాణా అన్న మాటలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. చర్చనీయాంశం అయ్యాయి. రాణా కమిట్ మెంట్ ఏంటో చెబుతోంది. షూటింగ్ లో రాణా అలియాస్ బల్లాలదేవ తన కుర్చీలో ఎవర్నీ కూర్చోనివ్వలేదంట. హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్క సరదాగా ఆటపట్టిస్తున్నా.. నా కుర్చీ నాదే అనేవారంట. తన కిరీటం, ఆయుధం అయిన గద, అలంకరణ వస్తువులన్నీ తనవే అనేవారంట. ఇదే విషయాన్ని ప్రభాస్ చెబుతూ.. నాలుగేళ్లు తన వస్తువులను ముట్టుకోనిచ్చేవాడే కాదని చెబుతున్నాడు. రాణాకు నటనపై ఉన్న కమిట్ మెంట్.. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయటమే అంటున్నారు. గతంలో సత్య మూవీ టైంలో జేడీ చక్రవర్తి, గజినీ హిందీ మూవీలో అమీర్ ఖాన్, స్వాతిముత్యం, సాగరసంగమం సినిమాల్లో కమలహాసన్ ఇలాగే పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారంట. పాత్రలో లీనమైనప్పుడు బయట ప్రపంచం కంటే.. ఆ క్యారెక్టరే తన జీవితంగా.. సినిమాలో తనువాడే వస్తువులన్నీ తనవేగా ఫీలవుతారు. ఇలా చేయటం మామూలు నటులకు సాధ్యం కాదంటున్నారు. హాలీవుడ్ లో ఇలా చేయటాన్ని మెథడాక్టింగ్ అంటారు. హాలీవుడ్ యాక్టర్స్ జాక్ నికల్ సన్, మార్లిన్ బ్రాండో, బ్యాట్ మెన్ మూవీలో నటించిన హీత్ లెడ్జర్ (జోకర్) నటనను మెథడాక్టింగ్ గా అభివర్ణిస్తుంటారు. అంటే పరకాయ ప్రవేశం అన్నమాట. V6 NEWS ఇంటర్వ్యూలో బల్లాలదేవ క్యారెక్టర్ గురించి ఏమన్నాడు.. షూటింగ్ విశేషాలు ఏంటో చూడండి..

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy