బల్వంత్ రాయ్ మెహతా మరణం – 50 ఏళ్ల నాటి మిస్టరీ

6530బల్వంత్ రాయ్ మెహతా… భారతదేశంలో పంచాయితీ రాజ్ వ్యవస్థకు ప్రాణం పోసిన స్వాతంత్ర్య సమరయోధుడు. ఇవాళ ఆయన 51వ వర్ధంతి. సరిగ్గా 50ఏళ్ల క్రితం ఆయన మనకు దూరమయ్యారు. ఘోర విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విమాన ప్రమాదంలో 1965 సెప్టెంబర్ 19న చనిపోయారు మెహతా. ఇండో-పాక్ వార్ సందర్భంగా పాక్ సైనికులు ఆయన ప్రయాణిస్తున్న బీచ్ క్రాఫ్ట్ ను హైజాక్ చేసేందుకు ప్రయత్నించారు. వింగ్ కమాండర్ ఆదేశాలతో పైలట్ దాన్ని కూల్చేశాడు. ఆ ప్రమాదంలో మెహతా, ఆయన భార్య, ఓ జర్నలిస్ట్ సహా.. ముగ్గురు సిబ్బంది చనిపోయారు. పంచాయితీ రాజ్ వ్యవస్థ కోసం ఎంతో కృషి చేసిన మెహతా మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఫాదర్ అఫ్ పంచాయితీ రాజ్ గా గుర్తింపు పొందిన బల్వంత్ రాయ్… 1900 ఫిబ్రవరి 19న గుజరాత్ లోని భావ్ నగర్ లో పుట్టారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy