బస్తర్ లో పోలీసుల సాక్షిగా మావోల పెళ్లి

naxals marraigeబస్తర్… ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోలకు కీలక ప్రాంతాల్లో ఇదొకటి. నక్సలిజం అంతానికి ఇక్కడి పోలీసులు నిత్యం పోరాడుతున్నారు. అలాంటి పోలీసులు ఇప్పుడు సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు బస్తర్ పోలీసులు. ఒకనాటి నక్సైట్లకు దగ్గరుండి మరీ పెళ్లి చేస్తున్నారు. ఈ నెల 16న జరగనున్న ఈ పెళ్లికి జదల్ పూర్ లోని గాంధీ గ్రౌండ్ లో సన్నాహాల్లో మునిగిపోయారు బస్తర్ పోలీసులు.

లక్ష్మణ్, మార్కమ్ ఇద్దరు మాజీ నక్సలైట్లు. గతేడాది మార్కమ్ లొంగిపోగా, లక్ష్మణ్ 2014లో లొంగిపోయాడు. వీరిద్దరూ అప్పటి నుంచి పోలీసుల సంరక్షణలోనే ఉంటున్నారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో స్థానిక ప్రజలు, ఓ ఎన్జీవోని సంప్రదించి ఈ నెల 16న లక్ష్మణ్, మార్కమ్ లకు పెళ్లి చేయాలని నిశ్చయించారు పోలీసులు. ఈ పెళ్లికి గ్రామస్థులు కూడా చేయి కలపడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 4వేల వెడ్డింగ్ కార్డ్స్ పంచి పెట్టారు. స్థానికంగా ఉన్న ప్రముఖులను ఆహ్వానించారు. సంప్రదాయబద్దంగా జరగనున్న ఈ వివాహవేడుకకు అందరూ వచ్చి కొత్త జంటను ఆశీర్వదించాలని కోరుతున్నారు బస్తర్ ఎస్పీ ఆర్ఎస్ దాస్.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy