బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా సిద్దిపేట

siddipetaODFబహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా (ఓడీఎఫ్)గా సిద్దిపేట నిలిచింది. సిద్దిపేట జిల్లాలో 26 రోజుల్లో 26,294 మరుగుదొడ్లను నిర్మించి, వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తిచేశారు. ఆదివారం (నవంబర్ 19న) అంతర్జాతీయ మరుగుదొడ్ల దినం సందర్భంగా మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి సిద్దిపేటను ఓడీఎఫ్ జిల్లాగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర్రాన్ని స్వచ్ఛ తెలంగాణగా తీర్చిదిద్దుతామన్నారు. ఆరోగ్యవంతమైన, హరిత తెలంగాణ కోసం అందరూ కృషి చేయాలని కోరారు. సిద్దిపేటను స్వచ్ఛ జిల్లాగా ప్రకటించుకోవడం ఆనందంగా ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. అందరూ ఇదే స్ఫూర్తితో పనిచేసి వందశాతం మరుగుదొడ్లను వినియోగంలోకి తేవాలని ఆయన పిలుపునిచ్చారు. అందరూ ఆత్మగౌరవంతో బతకాలన్నదే మహాత్మాగాంధీ ఆశయమన్నారు మంత్రి హరీశ్. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, యాదిగిరి రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారుఖ్ హుస్సేన్, వెంకటేశ్వర్లు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 2015 అక్టోబర్ 2న సిద్దిపేటను ఓడీఎఫ్ నియోజకవర్గంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy