బాండ్ ఈజ్ బ్రాండ్

jamesbondasonmartindb51హూ ఈజ్ బాండ్. ఇదే పాయింట్.. బాండ్ ఫ్యాన్స్ కి ఇంట్రస్టింగ్ పాయింటైంది. ప్రస్తుతానికి సిల్వర్ స్క్రీన్ పైకి రావడానికి రెడీగా ఉన్నాడు ఓ బాండ్. కానీ.. ఆ బాండ్ మాత్రం మరో సారి బాండ్ గా చేసేది లేదంటున్నాడు. దీంతో.. బాండ్ కోసం బోలెడు మంది హీరోలు పోటీపడుతున్నారు. గన్ను పట్టుకుని.. ఇన్వెస్టిగేట్ చేస్తామంటున్నారు. బాండ్ బ్రాండ్ ని పట్టేయాలని ప్లాన్ చేస్కుంటున్నారు. అసలీ బాండ్ కతేంటి. జస్ట్ సీ దిస్.

బాండ్… ఇదో బ్రాండ్. బాండ్ గన్నులోంచి బుల్లెట్టొస్తే.. సిల్వర్ స్క్రీన్ సిరిగిపోద్ది. బాండ్ బుర్రలోంచి ఐడియా వస్తే.. బాక్సాఫీస్ బ్రేక్ అయిపోద్ది. అందుకే.. వాల్డ్ వైడ్ గా సిల్వర్ స్క్రీన్స్ ని సింపేయడానికి మరో బాండ్ రెడీ అవుతున్నాడు. నవంబర్ 6న రిలీజ్ కి రెడీ అవుతోంది 24వ బాండ్ మూవీ ‘స్పెక్టర్’. ఇదే టైంలో నెక్స్ట్ బాండ్ ఎవరనేది ఇంట్రస్టింగ్ పాయింటైంది.

skyfall_2423625bస్పెక్టర్ మూవీతో నాలుగు సార్లు బాండ్ గా చేశాడు.. డేనియల్ క్రేగ్. ఈసారి మాత్రం నా వల్ల కాదని చెబుతున్నాడు డేనియల్. కంపెనీ మీద కంప్లైంట్స్ ఏం చేయకపోయినా.. ఆ సాహసాలు చేయడం ఇక నావల్ల కాదంటున్నాడు. జేమ్స్ బాండ్ మూవీ అంటే అదో బ్రాండ్ అనీ. అందరినీ శాటిస్పై చేయాలని.. అన్ని సాహసాలు చేయడం ఇక నావల్ల కాదని తేల్చేశాడు డేనియల్. మొన్నామధ్య ఇదో హాట్ న్యూస్. దీంతో.. నెక్స్ట్ బాండ్ ఎవరనేది ఇంట్రస్టింగ్ గా మారింది.

నిజమే డేనియల్ చెప్పిందాంట్లో అతిశయోక్తేం లేదు. బాండ్ అంటేనే అదో క్రేజ్. బాండ్ బ్రాండ్ ఉంటే చాలు.. వాల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. సినిమా ఎట్టుందనేది అసలు పాయింటే కాదు. ఆ యాక్షన్ సీన్స్ కి ఫిదా ఎవరైనా. చిన్న పిల్లల్నుంచి.. యంగ్ ఏజ్ వాళ్లు.. ఓల్డేజ్ వాళ్లు. ఇలా ఎవరైనా సరే.. పిచ్చెక్కే సీన్స్ అంటారు. అంతలా అట్రాక్ట్ చేసింది బాండ్ బ్రాండ్.

యాభై ఏళ్లకి పైగానే బాండ్ సిరీస్ లొస్తున్నయ్. అప్పట్నుంచి ఇప్పటి వరకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే.. బాండ్ మూవీలో రొమాన్స్ ఫుల్. ఇంటలిజెన్సూ ఫుల్. యాక్షన్ సీన్ల గురించి చెప్పాల్సిన పన్లేదు. టేకింగ్ అంటే దుమ్ములేచిపోయేలా ఉంటుంది. లొకేషన్లు. టెక్నాలజీ.. ఇమేజినేషన్. అన్నీ సూపరే. బాండ్ బడ్జెట్ కూడా బ్రాండ్ కి తగ్గట్లే బడా బడ్జెట్. ఇలా చెబుతూ పోతే. ఎన్నో మరి.

james-bond-007-logoనాలుగు సార్లుగా డేనియలే బాండ్. క్యాసినో రాయల్ మూవీతో బాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు డేనియల్. తర్వాత క్వాంటమ్ ఆఫ్ సోలెస్. దాంతర్వాత.. స్కై ఫాల్. ఇప్పుడు స్పెక్టర్. ఈ దశాబ్దంలో మూడు మూవీస్ రిలీజైనయ్. మరో మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. డేనియల్ కి కూడా సూపర్ పేరొచ్చింది. ఇప్పుడు మాత్రం నావల్ల కాదండంతో.. డేనియల్ ప్లేస్ ని రీ ప్లేస్ చేసే వాళ్ల కోసం సర్చింగ్ మొదలైంది.

జేమ్స్ బాండ్ అంటే.. అట్టిట్టుంటే సెట్టవదు. కేక ఉండాలి లుక్కు. అలా ఉంటేనే సెట్టైద్ది లెక్క. అందుకే సర్చింగ్ పెరిగింది. మామూలుగా మూవీలో బాండ్ సర్చ్ చేస్తుంటాడు. ఏదో ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. కానీ.. ఇప్పుడు బాండ్ కోసం ఇన్వెస్టిగేషన్ తప్పట్లే. అంతే కాదు. చాలా మంది హీరోలు కూడా బాండ్ బ్రాండ్ మీదేసుకోవాలని రూట్ కోసం సర్చింగ్. ఛాన్స్ దొరికితే బాండ్ అయిపోయి.. బ్రాండ్ పట్టేయాలని వెయిటింగ్.

కొంతమంది బాండ్ కోసం సర్చింగ్. ఇంకొంత మంది బాండ్ అవ్వాలని సర్చింగ్. ఇలా ఫుల్ గానే ఉంది క్రేజ్. మొత్తం పది మంది బడా హీరోలు.. బాండ్ అయిపోదామని వెయిటింగ్. ఛాన్స్ దొరికితే చాలు.. బాండ్ డ్రస్ ఏసుకుని గన్ను పట్టాలని ప్లానింగ్. దానికోసం వాళ్ల ప్లాన్లు వాళ్లు చేస్తున్నారు. అయితే బాండ్ బ్యాచ్ మాత్రం.. స్పెక్టర్ మూవీపై ఫుల్ గా ఫోకస్ చేశారు.

బాండ్ మూవీ రిలీజ్ అంటే చోటా మోటా విషయం కాదు. తెలుగులో జక్కన్న చేసిన హడావిడికి ఓ లక్షా తొంబై రెట్లు ఎక్కువ హడావిడి ఉంటుంది. జేమ్స్ బాండ్ అంటే క్రేజ్ అలాంటిది మరి. వాల్డ్ వైడ్ గా సింపేసే సిన్మా బాండ్. హాలీవుడ్డు.. బాలీవుడ్డు.. కోలీవుడ్డు అని లేదు. అన్ని ఉడ్డుల్నీ షేక్ చేయడానికి రెడీ అవుతోంది బాండ్ మూవీ.. స్పెక్టర్. వచ్చే నెల ఫస్ట్ వీక్ లో ఎంటర్ కానున్నాడు బాండ్.

మామూలుగా బాండ్ మూవీ అంటే.. మూన్నెళ్లకోసారి వచ్చేది కాదు. కనీసం మూన్నాలుగేళ్లు పడుతుంది. ప్లానింగ్ అంతా ముందు నుంచే నడుస్తుంది. అందుకే.. నెక్స్ట్ బాండ్ ఎవరనేది కూడా ఈ సినిమా రిలీజ్ కి ముందే స్టార్టైంది. అఫ్ కోర్స్ మూవీ ప్రమోషన్ స్టంట్ అని కూడా అనుకోవచ్చు. బట్.. డేనియల్ చేసిన కమెంట్స్.. మూవీ రిలీజ్ టైం దగ్గరికి రావడం.. ఇలా అన్నీ కలిసి హైప్స్ ని ఇంకాస్త హైప్ తీస్కెళ్లాయి.

గన్నేదైనా కావచ్చు. బుల్లెట్టేదైనా కావచ్చు. స్టోరీ కూడా అంతే…బాండ్ ఈజ్ కమింగ్. నెక్స్ట్ బాండ్ కోసం సర్చింగ్. బోలెడు మంది వెయిటింగ్. ఇదీ బాండ్ కి సంబంధించిన బ్రాండ్ న్యూస్.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy