బాక్సైట్ తవ్వకాల జీవోను రద్దు చేయాలి: జగన్

jaganలక్షల గొంతులు తమకు బాక్సైట్ తవ్వకాలు వద్దంటున్నా.. చంద్రబాబుకు మాత్రం జ్ఞానోదయం కావడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మండిపడ్డారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో వైఎస్సార్ సీపీ నిర్వహించిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. కేంద్రం చెబితే ఒకసారి కాస్త వెనక్కి తగ్గిన  బాబు… ఆ తర్వాత మళ్లీ గ్రామసభలు జరిగాయంటూ అబద్ధాలు చెప్పి బాక్సైట్ తవ్వకాల విషయంలో ముందుకెళ్తున్నారని  జగన్ ఆరోపించారు. ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు బాక్సైట్ తవ్వకాలు జరగనివ్వబోమని …ఇక్కడ గ్రామసభలు కూడా జరగలేదని, గ్రామసభలు ఒప్పుకోలేదని 2011లో గవర్నర్‌కు  బాబు లేఖ రాశారు. ఇదే చంద్రబాబు సీఎం అయ్యాక మొన్న ఒక శ్వేతపత్రం విడుదల చేసి, అందులో మాట మార్చేశారు. గ్రామసభలు జరిగాయని, అవి బాక్సైట్ మైనింగ్ కావాలంటూ తీర్మానించాయని అన్నారు. గ్రామాలేవీ అంగీకరించకపోయినా చంద్రబాబు అబద్ధాలు చెబుతూ ముందుకెళ్తున్నారంటూ ఆరోపించారు జగన్. నిజంగా ప్రజల  మంచిని కోరుకునే వాడివైతే వెంటనే బాక్సైట్ తవ్వకాలకు ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని లేదంటే …ప్రజల తరుపును పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు జగన్.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy